Live Updates: ఈరోజు (02 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 02 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పాడ్యమి: రా.03-02 వరకు తదుపరి విదియ | రేవతి నక్షత్రంపూర్తిగా | వర్జ్యం: సా.06-55 నుంచి రా.08-41వరకు | అమృత ఘడియలు: తె.05-32నుంచి 06-36 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ. 12-09 నుంచి 12.56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 2 Oct 2020 1:00 PM GMT
Tirupati updates: కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి మళ్ళీ పాజిటివ్...
-తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి మళ్ళీ పాజిటివ్
-జ్వరము, దగ్గు, ఒళ్లునొప్పులు, ఉండడంతో కరోనా పరీక్షా చేసుకోగా పాజిటివ్ అని నిర్దారణ
-సిటి స్కాన్ లో నార్మల్ గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు
-తనను కలిసిన వారు కరోనా పరీక్షా చేసుకోవలసిందిగా భూమన అభినయ్ అందరికి విజ్ఞప్తి
- 2 Oct 2020 12:57 PM GMT
Amaravati updates: విజయనగరం మహారాజా కళాశాల ప్రైవేటీకరణను ఖండిస్తున్నాం...
అమరావతి..
కళా వెంకట్రావ్
పత్రికా ప్రకటన
-అశోక్ గజపతిరాజుపై కక్షతో మాన్సాస్ ట్రస్ట్ ను నిర్వీర్యం చేయడం హేయం
-పంచభూతాలను దోచుకోవడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైజం.
-పాదయాత్ర సమయంలోనే జగన్ రెడ్డి కన్ను మాన్సాస్ ట్రస్ట్ పై పడింది.
-మాన్సాస్ ట్రస్ట్ ను భ్రష్టుపట్టించడమే లక్ష్యంగా ఏ1, ఏ2 లు తెరవెనుక పావులు కదుపుతున్నారు.
-మాన్సాస్ ట్రస్ట్ లో ప్రభుత్వ అనవసర జోక్యంతో, అటు సామాజిక సేవా కార్యకలాపాలను దెబ్బతీయడంతోపాటు, ట్రస్ట్ సంస్థ ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం గర్హనీయం.
- 2 Oct 2020 12:57 PM GMT
Amaravati updates: విజయనగరం మహారాజా కళాశాల ప్రైవేటీకరణను ఖండిస్తున్నాం...
అమరావతి..
కళా వెంకట్రావ్
పత్రికా ప్రకటన
-అశోక్ గజపతిరాజుపై కక్షతో మాన్సాస్ ట్రస్ట్ ను నిర్వీర్యం చేయడం హేయం
-పంచభూతాలను దోచుకోవడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైజం.
-పాదయాత్ర సమయంలోనే జగన్ రెడ్డి కన్ను మాన్సాస్ ట్రస్ట్ పై పడింది.
-మాన్సాస్ ట్రస్ట్ ను భ్రష్టుపట్టించడమే లక్ష్యంగా ఏ1, ఏ2 లు తెరవెనుక పావులు కదుపుతున్నారు.
-మాన్సాస్ ట్రస్ట్ లో ప్రభుత్వ అనవసర జోక్యంతో, అటు సామాజిక సేవా కార్యకలాపాలను దెబ్బతీయడంతోపాటు, ట్రస్ట్ సంస్థ ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం గర్హనీయం.
- 2 Oct 2020 12:54 PM GMT
East Godavari updates: ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ దాతృత్వం..
తూర్పుగోదావరి :
-2019 అసెంబ్లీ ఎన్నికలలో తన ప్రత్యర్థిగా పోటీన చేసిన వ్యక్తి కి పింఛన్ అందించిన ఎమ్మెల్యే పర్వత ప్రసాద్..
-ప్రజాశాంతి పార్టీ తరపున టిడిపి ప్రోద్బలంతో పోటీ చేసిన పర్వత ప్రసాద్ అనే వ్యక్తి..
-అనారోగ్యం పాలవడంతో ఏలేశ్వరం లో అతడి ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్..
- 2 Oct 2020 12:52 PM GMT
Krishna district updates: కంకిపాడు మండలంలో పర్యటించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
కృష్ణాజిల్లా..
మంత్రి ఆదిమూలపు సురేష్..
-కంకిపాడు ఎంపీపీ పాఠశాలలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు
-సీఎం జగన్ చేతుల మీదగా విద్యాకానుక అక్టోబర్ 5 న ప్రారంభం
-విద్యార్థులకు కిట్ లో పుస్తకాలు, మూడు జతల యూనిఫామ్, బ్యాగ్, షూస్, బెల్ట్ అందజేస్తాం
-తోలి విడతలో 12,500 పాఠశాలలకు మహర్దశ
-నాడు-నేడు పథకం ద్వారా పది రకాల మౌలిక వసతుల కల్పన
-ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యా బోధన అందే విధంగా కృషి
-సెప్టెంబర్ 30 లోగా మొదటి విడత పనులు పూర్తి చేస్తాం
-నవంబర్ 2 నుండి పాఠశాలలు ప్రారంభం
- 2 Oct 2020 12:49 PM GMT
Krishna district updates: ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ఇవ్వాలని వినతి: రైతులు..
కృష్ణాజిల్లా..
-గన్నవరం మండలం కొండపావులూరులో ఆర్ఎస్ నెం.6 ఎన్.డి.ఆర్.ఎఫ్, NIDM కోసం భూములిచ్చిన రైతులు
-నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా నష్టపరిహారం ఇవ్వలేదంటూ యన్.డి.ఆర్.ఎఫ్ ఎదుట ఆందోళనకు రైతులు
-ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేదు
-ఎన్ డి ఆర్ ఎఫ్ భూసేకరణలో ఇచ్చే నష్టపరిహారంలో అనేక అవకతవకలు
-కొంతమంది అధికారులతో కుమ్మక్కై సర్వే నెంబర్లను మార్చి నష్టపరిహారం పొందుతున్నారు
-భూముల్లో ఫెన్సింగ్ ను రెవెన్యూ అధికారులు రాత్రికి రాత్రి పడేయడంతో తీవ్రంగా నష్టపోయాం
- 2 Oct 2020 12:45 PM GMT
Amaravati updates: బాలిక పై అత్యాచారం చేసిన వాలంటీర్ కి చప్పట్లు కొట్టాలా...?
అమరావతి..
-ట్విట్టర్ లో టిడిపి సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి...
-వృద్ధురాలి మెడలో గొలుసు కొట్టేసిన వాలంటీర్ కి సత్కారం చెయ్యాలా...?
-నాటు సారా కాసిన వాలంటీర్ ని అభినందించాలా...?
-అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన వాలంటీర్ కి సన్మానం చెయ్యాలా...?
-మహిళ పై హత్యాయత్నం చేసిన వాలంటీర్ కి కృతజ్ఞతలు తెలపాలా...?
-ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న వారికి చప్పట్లు కొట్టాలా..?, చెట్టుకి కట్టేసి కొట్టాలా...? సమాధానం చెప్పండి జగన్ గారు.
-ఏడాదిగా వాలంటీర్లు చేస్తున్న అరాచకాలకు సంబంధించిన వీడియోని ట్విట్టర్ లో రిలీజ్ చేసిన బండారు సత్యనారాయణ మూర్తి...
- 2 Oct 2020 12:35 PM GMT
Amaravati updates: దళితుల రక్షణ చర్యలు చేసిన ఘనత జగన్ దే....
అమరావతి..
-వైసీపీ ఎంఎల్సీడొక్కా మాణిక్య వరప్రసాద్..
-1.38లక్షల గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఉద్యోగాలు కల్పించారు
-85వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సచివాలయ ఉద్యోగులు ఉన్నారు
-దళితులకు అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదు
-దళితుల మీద దాడిలో ఎస్సై, సీఐ స్ధాయి వ్యక్తులపై చర్యలు తీసుకున్నది జగన్ ప్రభుత్వం
-కొన్ని రాజకీయ పార్టీల అజెండాతో దళితులు మోసపోవద్దు
-జగన్ సంక్షేమ కార్యక్రమాలు చూస్తుంటే ఆర్ధిక శాస్త్రవేత్తలు అందరూ నివ్వెరపోతున్నారు
-కుల, మత విబేధాలు తేవడంపై జాగృతంగా ఉండాలని దళిత సంఘాలకు విజ్ఞప్తి
-దళితులు వాస్తవాలను గమనించాలి
- 2 Oct 2020 12:22 PM GMT
Amaravati updates: వెబ్ సైట్ లలో టెండర్ ఫారాలు లభ్యం కావడం లేదు: పోతిన వెంకట మహేష్ ...
అమరావతి..
-కనక దుర్గమ్మ వారి ఆలయంలో ఆహ్వానించిన మూడు టెండర్లు కు నేటి వరకు నాలుగు రోజులైనా వెబ్ సైట్ లలో టెండర్ ఫారాలు లభ్యం కావడం లేదు.
-ఇందులో ఈవో సురేష్ బాబు మరల మంత్రి వెల్లంపల్లి అనుచరులకు బంధువులకు కట్టబెట్టే కుట్రకోణం ఉందనే అనుమానం కలుగుతుంది.
-ఈ విషయంలో పారదర్శకత లేకపోతే జనసేన భక్తుల తరపున పోరాటం చేస్తుంది.
-పోతిన వెంకట మహేష్ (జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్)
- 2 Oct 2020 12:17 PM GMT
Amaravati updates: మదనపల్లి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం... కె రామకృష్ణ...
అమరావతి...
-జడ్జి రామకృష్ణ, హైకోర్టు న్యాయవాది దేవన్ కుమార్ ను పోలీసులు నిర్బంధించడాన్ని ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
-ప్రశాంతంగా జరిగే చలో మదనపల్లి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం.
-దళితులపై దాడులకు అడ్డుకట్ట వేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది.
-తక్షణమే నిర్బంధించిన వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire