Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 02 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | విదియ రా.11-01 తదుపరి తదియ | కృత్తిక నక్షత్రం రా.10-50 తదుపరి రోహిణి | వర్జ్యం ఉ.9-38 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు రా.8-11 నుంచి 9-56 వరకు | దుర్ముహూర్తం మ.12-06 నుంచి 12-52 వరకు తిరిగి మ.2-23 నుంచి 3-09 వరకు | రాహుకాలం ఉ.7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 2 Nov 2020 10:59 AM GMT
West Godavari Updates: సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ధర్నా...
పశ్చిమగోదావరి జిల్లా
- ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆశ వర్కర్ల సమస్యలు ప్రభుత్వం నెరవేర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు.
- సచివాలయాలకు ఆశా వర్కర్ల అనుసంధానం ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు పోచమ్మ.రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించిన తర్వాతే ఆశా లను రిటైర్మెంట్ చేయాలనీ విజ్ఞప్తి చేశారు.అర్హులైన ఆశాలకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నారు.
- ప్రతినెలా రూ.10 వేలు వేతనం ఒకేసారి చెల్లించాలనీ ప్రభుత్వాన్ని కోరారు. మరణించిన ఆశాలకు 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు.కోవిడ్ 19 డ్యూటీ ప్రత్యేక అలవెన్స్ పదివేలు ఇవ్వాలన్నారు.
- సెల్ ఫోన్స్ ప్రభుత్వమే ఇవ్వాలనీ ఫోన్స్ కొనాలనే అధికారుల వేదింపులు ఆపాలన్నారు.
- 2 Nov 2020 9:44 AM GMT
అమరావతి:
ఆన్‌లైన్ క్లాస్‌లు:
ఉన్నత విద్య పరంగా ఇప్పటి వరకూ చేపట్టిన సంస్కరణలు, వాటి ప్రగతిని సీఎంకు వివరించిన అధికారులు
ఈ విద్యా సంవత్సరంలో క్లాసులు ప్రారంభం, తీసుకుంటున్న చర్యలను సీఎంకు తెలిపిన అధికారులు
కోవిడ్ కాలంలో ఎనీటైం – ఎనీవేర్ లెర్నింగ్ పద్ధతిలో క్లాసులు నిర్వహించామని తెలిపిన అధికారులు
5 లక్షల ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించామని చెప్పిన అధికారులు
దీన్ని ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసి మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి ఆలోచనలు చేయాలన్న సీఎం వైయస్.జగన్
ఒత్తిళ్లు వద్దు:
కోవిడ్ కారణంగా వృథా అయిన కాలాన్ని కవర్ చేసే ఉద్దేశంతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకు రావొద్దన్న సీఎం జగన్
విద్య అన్నది వికాసానికి దారి తీయాలే తప్ప ఒత్తిడితో సతమతం అయ్యే పరిస్థితి వద్దన్న సీఎం
చదువులు ఆనందంగా సాగాలి కాని, ఒత్తిళ్ల మధ్య ఉండకూడదన్న సీఎం
కేంద్ర ప్రభుత్వం, యూజీసీ మార్గదర్శకాలను కూడా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలన్న సీఎం
ఈ విద్యా సంవత్సరంలో వసతి దీవెన, విద్యాదీవెన పథకాల అమలుకు ప్రణాళిక వేసుకోవాలన్న సీఎం
యూనివర్సిటీలు–ప్రమాణాలు:
ప్రైవేటు యూనివర్సిటీల్లో ప్రమాణాలపై సమావేశంలో చర్చ
లైసెన్సింగ్ విధానం, రెగ్యులేషన్ పటిష్టంగా ఉండడంపై సమావేశంలో చర్చ
మెరుగైన మౌలిక సదుపాయాలు, బోధన ఉంటుందనే ఉద్దేశంతోనే ఎవరైనా ప్రైవేటుసంస్థలకు వెళ్తారు: సీఎం జగన్
అలాంటి సందర్భాల్లో ఆయా సంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, మెరుగైన ప్రమాణాలు ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలన చేయాలి
ప్రైవేటు కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు, ఉండాల్సిన సిబ్బంది లేకపోతే గట్టి చర్యలు తీసుకోవాలి
50 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద, మిగిలిన 50 శాతం సీట్లు కాలేజీ కోటా కింద ఉండాలని సమావేశంలో నిర్ణయం
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారం కన్వీనర్ కోటాలో పేద పిల్లలకు సీట్లు వస్తాయని, వారికి ప్రభుత్వమే ఫీజు రియింబర్స్‌మెంట్ కింద ఫీజులు చెల్లిస్తుందన్న సీఎం
ఈ ప్రైవేటు యూనివర్శిటీలకు నిర్వహిస్తున్న కోర్సుల ప్రకారం ఎన్‌బీఏ, ఎన్‌ఏసీ–న్యాక్ గుర్తింపు కూడా ఉండాలని సమావేశంలో నిర్ణయం
ప్రతిష్టాత్మకంగా విద్యా సంస్థలు:
ఐఐటీ తిరుపతి, ఐఐఎస్‌ఈఆర్ తిరుపతి, ఐఐఎం విశాఖ, ఎన్‌ఐటీ తాడేపల్లిగూడెంల్లో పనుల ప్రగతిని వివరించిన అధికారులు
ఆయా సంస్థలకు వెళ్లే రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, విద్యుత్ కనెక్షన్ వంటి వాటిలో సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశం
అనంతపురం సెంట్రల్ వర్శిటీ పనుల తీరును వివరించిన అధికారులు
పనులు ముందుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
ట్రైబల్ యూనివర్శిటీపై దృష్టి సారించాలన్న సీఎం
కోర్సుల ఇంటిగ్రేషన్:
పాలిటెక్నిక్ కోర్సుల్లో కొత్త కోర్సులను తీసుకురావాలని సీఎం ఆదేశం
ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలన్న సీఎం
కోర్సుల ఇంటిగ్రేషన్ ఉండాలన్న సీఎం
ఇంజినీరింగ్ కోర్సులతోపాటు వెటర్నరీ, అగ్రికల్చర్ కోర్సులను అవసరాలకు అనుగుణంగా ఇంటిగ్రేషన్ చేసేలా మార్గదర్శక ప్రణాళిక తయారు చేయాలన్న సీఎం
ఉద్యోగాల కల్పన కేంద్రాలుగా పాలిటెక్నిక్ కాలేజీలను తీర్చిదిద్దాలి
దేశంలో, ప్రపంచంలో వస్తున్న కొత్త కోర్సులను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చి వాటిని ఈ కాలేజీల్లో ప్రవేశపెట్టాలి
స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు:
నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక కాలేజీ (స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్) పెడుతున్నాం
ఇదివరకే పాటిటెక్నిక్, ఇంజినీరింగ్ లాంటి కోర్సులు పూర్తి చేసిన వాళ్ల ప్రతిభకు అక్కడ మరింత మెరుగులు పెడతారు : సీఎం జగన్
అలాగే చిన్న చిన్న పనులు నేర్పించడానికి కూడా కోర్సులు ప్రవేశపెడతారు: సీఎం
కెపాసిటీ బిల్డింగ్ కాంప్లెక్స్‌లు:
సామర్థ్యాన్ని పెంచేలా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కెపాసిటీ బిల్డింగ్ కాంప్లెక్స్‌ను తీసుకురావాలి: సీఎం
టీచర్లు మొదలు సచివాలయాల ఉద్యోగుల వరకు అందరిలో నైపుణ్యాలను పెంచేలా అవి ఉపయోగపడతాయి.
శిక్షణ కేంద్రాలుగా కూడా ఆ కాంప్లెక్స్‌లు పని చేస్తాయి.
జిల్లాల్లో మంచి సదుపాయాలనన్న కాలేజీలను, ఇతర ప్రభుత్వ శిక్షణ కేంద్రాలను ఈ కెపాసిటీ బిల్డింగ్ కోసం వాడుకునే అవకాశాలను పరిశీలించాలి
సామర్థ్యాన్ని పెంచడంలో ఐఐటీల భాగస్వామ్యం కూడా తీసుకోవాలి: సీఎం
- 2 Nov 2020 9:43 AM GMT
అమరావతి
ఏపీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కోవిడ్ ఆసుపత్రుల్లో చర్యలపై దాఖలైన పిటీషన్ విచారించిన హైకోర్టు
కౌంటర్ దాఖలు చేయటానికి మరింత సమయం కోరిన ప్రభుత్వం
తదుపరి విచారణ 3 వారాల తర్వాత వాయిదా
- 2 Nov 2020 9:43 AM GMT
అమరావతి
విజయవాడలో సీనియర్ అడ్వకేట్ సుల్తాన్ ముసావీ కుటుంబంలో విషాదం పట్ల మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
20రోజుల వ్యవధిలో కుటుంబంలో నలుగురు మృతి చెందడం బాధాకరం.
ముసావీతో పాటు తల్లి, భార్య, కొడుకు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం.
కరోనా ఏవిధంగా ప్రజల ప్రాణాలను బలిగొంటుందో, కుటుంబాలను అస్తవ్యస్థం చేసిందో, ఈ విషాదమే తార్కాణం.
సుల్తాన్ ముసావీ కుమార్తెకు, తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు, ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
- 2 Nov 2020 9:42 AM GMT
అమరావతి
ఇంటర్మీడియట్ ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియను ఈ నెల 10 వ తారీఖు వరకు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్ట్
- 2 Nov 2020 9:42 AM GMT
విజయవాడ
దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు
ఐఐటీ ప్రొఫెసర్ మాధవ్ తో కూడిన నిపుణుల కమిటీ కొండ చరియలు విరిగి పడే ప్రాంతాన్ని పరిశీలించారు..
ఒక వారం లోపు నేవిధిక సమర్పిస్తామని నిపుణుల కమిటీ చెప్పింది....
భక్తుల భద్రత మాకు ముఖ్యం...
మాధవ్ ఐఐటీ ప్రొఫెసర్,శివ కుమార్ IISC బెంగళూరు
12 ఏళ్ల నుండి కొండ చరియలు గురించి సలహాలు ఇస్తున్నాం...
ఘాట్ రోడ్డు విస్తరణ కు కొండను తవ్వారు...
అపుడు కొండ ప్రాంతం దెబ్బతింది..
ఫెన్సింగ్ ద్వారా కొంత మేరకు కట్టడి చేశారు...
ఈ కొండ రాయి రాక్ ఫాల్ టైప్...
ఫెన్సింగ్, కేబుల్,హైడ్రో సీలింగ్ చేస్తే ప్రమాద తీవ్ర త ను తగ్గించ వచ్చు...
కొండ గట్టిదే కానీ కొండ మీద వర్షం వచ్చినపుడు నీరు ఆగితే ప్రమాదం...
కొండ మీద నీరు నిల్వ లేకుండా బయటకి పంపేందుకు సలహాలు ఇచ్చాము...
కొండ చుట్టూ పూర్తిగా ఫెన్సింగ్ వేస్తే కొండ చరియలు పడినా ప్రమాదాలు నివారించ వచ్చు...
హైడ్రో సీలింగ్(సీడ్స్ వేసి చిన్న సైజ్ చెట్లు పెంచితే) చేస్తే ప్రమాదాలు జరగవు...
- 2 Nov 2020 9:41 AM GMT
శ్రీకాకుళం జిల్లా..
జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీఎస్ ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్..
ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు APCOS కార్పొరేషన్ లో చేర్చాలని కోరుతూ ఆందోళన..
లాక్ డౌన్ కాలానికి జీతాలు చెల్లించాలని డిమాండ్..
- 2 Nov 2020 9:41 AM GMT
అమరావతి.
ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, ఇతర ఉన్నతాధికారులు హాజరు.
- 2 Nov 2020 9:40 AM GMT
విశాఖ
విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో విజిలెన్స్ అవారెన్స్ వీక్ 2020 ముగింపు కార్యక్రమం
ముఖ్య అతిథులుగా పాల్గొన్న పోర్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు, జీవీఎంసీ కమీషనర్ సృజన
పోర్ట్ చైర్మన్ కె.రామ్మోహన్ రావు కామెంట్స్......
పోర్ట్ అధికారులు, ఉద్యోగులు అందరూ కలసి కట్టుగా కరోనా కాలంలో పనిచేయడం వలన పోర్ట్ అభివృద్ధి సాధించింది
కరోనా కాలంలో కూడా పని చేసి పోర్ట్ అభివృద్ధికి పాటుపడిన ప్రతిఒక్క ఉద్యోగికి కృతజ్ఞతలు
100 మిలియన్ టన్నుల పోర్ట్ ఎగుమతుల కు గాను ఈ సంవత్సరం 80 మిలియన్ టన్నులు సాధించింది
ప్రతిఒక్క పౌరుడు సామాజిక స్పృహ కలిగి దేశఅభివృద్ధికి పాటుపడాలని కోరారు.
జీవీఎంసీ కమీషనర్ సృజన కామెంట్స్....
దేశం లో ప్రతి పౌరుడు కి ప్రభుత్వం నుండి సేవలు పొందే హక్కు ఉంది.
అధికారులు వ్యవస్థపై నమ్మకం కలిగేలా పని చేయాలి.
ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడకుండా పారదర్శకంగా పనిచేయాలని అన్నారు.
- 2 Nov 2020 9:40 AM GMT
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
56 బీసీ కార్పొరేషన్ లకు ఛైర్మెన్ లు ,672 మంది డైరెక్టర్లను నియమించాము
పాదయాత్రలో అందరితో మమేకమై సమస్యలు తెలుసుకొని ఆకళింపు చేసుకొన్న వ్యక్తి జగన్
అధ్యయన కమిటీ తో నివేదికలు తెప్పించుకొని బీసీ ల సమస్యల కోసం నడుం బిగించారు
బీసీ గర్జనలో ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేరుస్తున్నారు
ప్రభుత్వం బీసీ లకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తోంది
ఏ ముఖ్యమంత్రీ అందించని సంక్షేమాన్ని జగన్ అందిస్తున్నారు
బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి చంద్రబాబు మోసం చేసాడు
సచివాలయ వ్యవస్థతో ఉద్యోగావకాశాలు కల్పించి యువతకు వైఎస్ జగన్ అండగా నిలిచారు
ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తున్నారు
29 ప్రజారంజక పధకాలు రాష్ట్రం లో అమలు జరుగుతున్నాయి
చంద్రబాబు మాటలు తప్ప బీసీ లకు చేతల్లో చేసింది ఏమీ లేదు
జగన్ బాబులా మాటల మనిషి కాదు
బీసీల అభ్యున్నతికి ఏమిచేయాలో చేతల్లో చూపించారు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire