Live Updates: ఈరోజు (సెప్టెంబర్-01) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం, 01 సెప్టెంబర్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం చతుర్దశి (ఉ.8-47 వరకు) తదుపరి పూర్ణిమ, ధనిష్ఠ నక్షత్రం (సా. 4-55 వరకు) తదుపరి శతభిషం, అమృత ఘడియలు (ఉ.6-04 నుంచి 7-44 వరకు) వర్జ్యం (రా. 12-23 నుంచి 2-15 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా.10-51 నుంచి 11-37 వరకు) రాహుకాలం (సా. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం: ఉ.5-49; సూర్యాస్తమయం: సా.6-13

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 1 Sep 2020 8:17 AM GMT

    Nizamabad district updates: నగరం లో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ప్రారంభం..

    నిజామాబాద్ :

    -నగరం లో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ప్రారంభం.

    -శోభాయాత్ర ప్రారంభించిన సార్వ జనిక్ గణేష్ మండలి ప్రతినిధులు, అర్బన్ ఎం.ఎల్.ఏ. గణేష్ గుప్తా.

    -దుబ్బ ప్రాంతం నుంచి ప్రధాన వీధుల మీదుగా వినాయకుల బావి వరకు కొనసాగనున్న

    -గణేష్ నిమజ్జన శోభాయాత్ర

    -కరోనా నేపథ్యం లో శోభాయాత్ర లో కనిపించని జనం.

    -భారీ బందోబస్తు మధ్య కొనసాగుతున్న శోభాయాత్ర.

  • 1 Sep 2020 8:14 AM GMT

    Telangana latest news: తెలంగాణ గురించి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలు....

    -నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శి...

    -తెలంగాణ ఇది ప్రజాస్వామ్యమా... ?రాచరికమా... ? ప్రగతిభవన్ కు ఇనుప కంచా... ??

    -ముఖ్యమంత్రి కార్యకలాపాలు నిర్వహించే ప్రగతి భవన్ కి ఇప్పటికే 15 పైగా గేట్లు ఉన్నాయి 24 గంటలు పోలీసులు కాపాల ఉంటున్నారు...

    -ఈ మధ్య కాలంలో ప్రగతి భవన్ వద్ద ఆందోళన చేస్తున్నారని భయపడి ఉన్న గేట్లను చుట్టూ ముళ్ల కంచెలు వేస్తున్నారు.దీని తరువాత దానికి కరెంట్ కనెక్షన్     వేసి షాక్ పెడతారు...

    -ఏ ప్రజల చేత ఎన్నుకోబడ్డాడో ఆ ప్రజలను చూసి ముఖ్యమంత్రి భయపడుతున్నాడు...

    -రచరికపు పాలనలో నిజాం నవాబు కాలం లో చుట్టూ కోటలు కంధకాలు ఉండేవి..

    -నిజాం నవాబు కన్నా నియంత లా కేసీఆర్ పనిచేస్తున్నాడు ప్రజలు తిరగబడితే ఈ ముళ్ళు కంచెలు అవుతాయా...?

    -ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉంటే వీటిని ఉపసహరించుకోండి...

  • 1 Sep 2020 8:04 AM GMT

    Telangana latest news: రాయలసీమ ఎత్తిపోతల పథకం పిటీషన్ పై హైకోర్టు విచారణ...

    టీఎస్ హైకోర్టు....

    -రాయలసీమ ఎత్తిపోతల పథకం పిటీషన్ పై హైకోర్టు విచారణ...

    -రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై విచారణ నిరవధిక వాయిదా వేసిన హైకోర్టు..

    -కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి, సామాజిక కార్యకర్త శ్రీనివాస్ పిటీషన్ దాఖలు..

    -సుప్రీంకోర్టు, ఎన్ జీటీలో పెండింగ్ లో ఉండగా తాము ఎలా జోక్యం చేసుకోవాలన్న హైకోర్టు

    -తెలంగాణ హైకోర్టుకు విచారణ పరిధి ఉంటుందన్న తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు

    -సుప్రీంకోర్టులో నదీ జలాల కేటాయింపు అంశం ఉందన్న తెలంగాణ అదనపు ఏజీ

    -అనుమతులు లేకుండా ఏపీ పనులు చేపడుతోందని హైకోర్టు ముందున్న వివాదమన్న అదనపు ఏజీ

    -ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశించగలదన్న హైకోర్టు..

    -డీపీఆర్ సమర్పించి, టెండర్లకు వెళ్లేందుకు ఏపీకి ఎన్ జీటీ అనుమతిచిందన్న పిటిషనర్ న్యాయవాది

    -ఎన్ జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదన్న హైకోర్టు..

    -ఎన్ జీటీకి విచారణ పరిధి లేదన్న తెలంగాణ ప్రభుత్వం..

    -విచారణ పరిధి పై ముందు ఎన్జీటీ తేల్చాలన్న హైకోర్టు .

    -పిటిషన్ లోని అన్ని అంశాలు సుప్రీంకోర్టు ముందున్నాయన్న ఏపీ ఏజీ శ్రీరాం..

    -సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఆగాలన్న ఏపీ ఏజీ ..

    -సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు నిరవధిక వాయిదా వేసిన హైకోర్టు..

    -సుప్రీంకోర్టులో తేలిన తర్వాత తమ దృష్టికి తీసుకు రావచ్చునని పిటిషనర్లకు సూచించిన హైకోర్టు.

  • 1 Sep 2020 8:01 AM GMT

    Hyderabad latest news: HMTV తో హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్....

    -HMTV తో హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్....

    -గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయీ..

    -కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేష్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి..

    -నిమజ్జనానికి 15 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసాం...

    -ఇప్పటి వరకు ఏలాంటి సంఘటన లు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి..

    -సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసాం...

    -ఇప్పటికే బాలాపూర్ గణేష్ డు నిమజ్జనం అయ్యాడు..

    -మరికొద్ది సేపట్లో ఖైరతాబాద్ గణేష్ డు కూడా నిమజ్జనం అయిపోతుంది..

    -కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితి ని సమీక్షిస్తున్నాం..

    -ఈరోజు లేట్ నైట్ వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది.

    -భక్తులు,ఉత్సవ సమితి నాయకులు కోవిడ్ రూల్స్ ను పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు జరుపుకోవాలి..

  • 1 Sep 2020 7:57 AM GMT

    Hyderabad latest news: మొదలైన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర..

    హైదరాబాద్..   

    -మొదలైన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర

    -ఖైరతాబాద్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకోనున్న గణనాథుడు

  • 1 Sep 2020 7:52 AM GMT

    Telangana latest news: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి ,తెలంగాణ రాష్ట్రం కు తీరని లోటు.

    ఆర్ధిక మంత్రి హరీష్ రావు..

    # మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి ,తెలంగాణ రాష్ట్రం కు తీరని లోటు.

    # రాష్ట్రపతి గా తెలంగాణ గజిట్ పై సంతకం పెట్టారు.

    # సీఎం కేసీఆర్ తో 2004 హిమాచల్ ప్రదేశ్ లో తొలిసారి ప్రణబ్ ముఖర్జీ కలిశాను.

    # సీఎం కేసీఆర్ తో నేను కూడా ప్రణబ్ ముఖర్జీ కలవడానికి వెళ్ళాను ఆరోజు అన్నారు... యూపీఏ ప్రభుత్వం వస్తే మీరు ఇంట్లో కూర్చుండి తెలంగాణ తీసుకోవచ్చు అని

    # రాష్ట్రపతి అయ్యాక సంతకం పెట్టారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

    # తెలంగాణ రాష్ట్రం అవసరం ,1969 ఉద్యమం గురించి కేసీఆర్ ప్రణబ్ కు వివరించారు.

    # ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం లో కేసీఆర్ గురించి రాసారు.

    # సీఎం కేసీఆర్ ను ఎన్నో సార్లు కొనియాడారు ప్రణబ్ ముఖర్జీ ,ఉద్యమం చేసిన వ్యక్తివి నేడు సీఎం కావడం అరుదుగా వస్తుంది అవకాశం అని అన్నారు

    # రాజకీయంలో ఎంతో అపార అనుభవం ఉన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ.

    # ఎంతో క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ కి, ప్రభుత్వం కు అండగా ఉన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ.

  • 1 Sep 2020 7:47 AM GMT

    Komaram Bheem district updates: కాగజ్‌నగర్‌ లో అలుగు అనే జంతువును వేటాడిన రాకెట్ సభ్యులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు.

    కుమురంభీం జిల్లా:

    -కాగజ్‌నగర్‌ లో అలుగు అనే జంతువును వేటాడిన రాకెట్ సభ్యులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు.

    -పదిమందిని అరెస్టు చేసిన అటవీ అదికారులు.

  • 1 Sep 2020 7:42 AM GMT

    Nizamabad district updates: జిల్లాలో యూరియా డిమాండ్ పై దృష్టి పెట్టిన మంత్రి ప్రశాంత్ రెడ్డి..

    నిజామాబాద్ :

    -జిల్లాలో యూరియా డిమాండ్ పై దృష్టి పెట్టిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.

    -జిల్లాకు మూడు ర్యాక్ ల2248 మెట్రిక టన్నుల యూరియా కేటాయింపు.

    -క్రిబ్ కో ద్వారా 548 మెట్రిక్ టన్నులు, ఎన్.ఎఫ్.సి.ఎల్. ద్వారా 500, ఎన్.ఫ్.ల్. ద్వారా 1200 మెట్రిక్ టన్నుల కేటాయింపు.

    -గురువారం నుంచి అన్ని సొసైటీ ల్లో పంపిణీ. : కలెక్టర్

  • 1 Sep 2020 7:39 AM GMT

    Komaram Bheem district updates: ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదిన మేకల కాపరి..

    కుమురంభీం జిల్లా:

    -కాగజ్‌నగర్‌ వ్యవసాయ చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదిన మేకల కాపరి..

    -రోడ్డుపై మేకలను పక్కకు తోలమని తోలమని చెప్పినందుకు అర్టీసీ డ్రైవర్ పై దాడి ..

    -పరస్పరం ఒకరి పై ఒకరు పోలీసులకు పిర్యాదు చేసుకున్న అర్టీసీ డ్రైవర్, మేకల కాపరి

  • 1 Sep 2020 7:33 AM GMT

    Adilabad district updates: ఎస్సీ, ఎస్టీ, భూముల పరి రక్షణ కోసం నిరసన దీక్ష..

    ఆదిలాబాద్..

    -కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్సీ, ఎస్టీ, భూముల పరి రక్షణ కోసం నిరసన దీక్ష..

    -అదివాసీల దర్నాకు ముఖ్య అతిథిగా ఎంఅర్ పిఎస్ మందక్రిష్ణ మాదిగ..

    -డంప్ యార్డు, రైతు వేదికల పేరుతో ఎస్సీ , ఎస్టీ భూములను సర్కార్ గుంజుకుంటోంది..

    -సిద్దిపేటలో‌‌ కలెక్టర్ కార్యాలయం కోసం దళితుల భూములను గుంజుకున్నారు..

    -సీఎం కేసీఆర్ వల్ల దళితులకు, గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది..

    -అతి తక్కువ శాతం ఉన్న వేలమలకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చారు

    -క్యాబినెట్ లో దళితులకు, గిరిజనులకు చోటు లేదు..

    -తెలంగాణ లో అదిపత్య వర్గాల రాజ్యం నడుస్తోంది..

    -మహజన సోషలిస్ట్ రాజ్యం రావడానికి అందరు సన్నద్దం కావాలని పిలుపునిచ్చిన. మంద క్రిష్ణ

Print Article
Next Story
More Stories