Live Updates: ఈరోజు (01 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 01 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 01 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పౌర్ణిమ: రా.01-05 వరకు తదుపరి | ఉత్తరాభాద్ర నక్షత్రం తె.05-39వరకు తదుపరి | వర్జ్యం: మ.01-56 నుంచి 03-41వరకు | అమృత ఘడియలు: రా.12-24నుంచి 02-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ. 02-28 నుంచి 03.15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 1 Oct 2020 3:14 PM GMT
Mumaith Khan Comments: నాకు క్యాబ్ డ్రైవర్ ను చీట్ చేయాల్సిన అవసరం ఏంటి..
ముమైత్ ఖాన్ సినీ నటి..
-రెండు రోజుల నుంచి నా పై జరుగుతున్న తప్పుడు ఆరోపణలపై ఫిర్యాదు ఇచ్చాను..
-కొన్ని మీడియా చానళ్లు నా పరువుకి భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేశారు..
-నా క్యారెక్టర్ ను జడ్జ్ చేసే అధికారం ఏముంది ఒక్కసారి ఆలోచించండి..
-నామీద డ్రైవర్ తప్పుడు ఆరోపణలు చేశాడు..
-అతను రాష్ డ్రైవింగ్ చేసి నన్ను భయాందోళనకు గురి చేశాడు..
-అతనిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాను..
-నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ పోలీసులకు అందజేశాను..
-అతనికి 23 వేలు 500 డబ్బులు చెల్లించాను..
-మీడియా ఒక్క సైడ్ వర్షన్ తీసుకొని వార్తలు వేయడం నన్ను బాధించింది..
-నేను 12 సంవత్సరాల నుండి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను నా క్యారెక్టర్ గురుంచి అందరికీ తెలుసు..
-టోల్ గేట్ లకు సంబంధించి పూర్తి డబ్బులు నేనే కట్టాను..
- 1 Oct 2020 3:00 PM GMT
Hyderabad updates: ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ నేతల క్యాండిల్ ర్యాలీ..
హైదరాబాద్..
-యూపీలో రేపిస్టులను ఉరి తీయాలంటూ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డుల ప్రదర్శన
-మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు
-పాల్గొన్న టీపీసీసీ ఉత్తమ్, పొన్నాల, ఫిరోజ్ ఖాన్, పొన్నం
- 1 Oct 2020 2:45 PM GMT
T. Harish Rao Comments: వివిధ పార్టీల నాయకులు టి ఆర్ ఎస్ పార్టీలో చేరిక...
సిద్దిపేట జిల్లా:
-సిద్దిపేట లోని మంత్రి హరీష్ రావు గారి నివాసంలో దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం పల్లె పహాడ్ , వేములఘాట్ గ్రామాల నుండి వివిధ పార్టీల నాయకులు టి ఆర్ ఎస్ పార్టీలో చేరిక...
-ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ...
-ప్రతిపక్షాలు మనతో అడుకొని రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు...
-ప్రతిపక్షాలు మనం బ్రతికుండగా ప్రాజెక్ట్ లు కావు నీళ్లు రావు అని అనేవారు..
-ప్రభుత్వం పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసింది..
-ఎవరు అవునన్నా, కాదన్న ఇంకా మూడు ఎంద్లు టీ అర్ ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది...
-కొండ పోచమ్మ సాగర్ నిర్వాసితులకు ఎలాంటి సహాయం అందించమో మల్లన్న సాగర్ నిర్వాసితులకు కూడా ఇస్తాం...
-ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఎన్ని కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసిన చివరకు ఎం సాధించారు...
-మీ నమ్మకాన్ని నిలబెడుతా, మీకు న్యాయం చేస్తాం...
-త్వరలోనే ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తాం
- 1 Oct 2020 2:19 PM GMT
Gandhi Bhavan updates: రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు...
గాంధీ భవన్..
-గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయల్దేరిన రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు...
-బీజేపీ కార్యాలయం నుంచి ఎదురుగా దాడికి వచ్చిన బిజెపి కార్యకర్తలు...
-గాంధీభవన్ బిజెపి మధ్యలో ఉన్న రహదారిపై వద్ద ఉద్రిక్తత
-మోడీ యోగి డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు....
-ప్రియాంక రాహుల్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ నేత నినాదాలు.
- 1 Oct 2020 2:05 PM GMT
Hyderabad updates: జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశం: మేయర్ బొంతు రామ్మోహన్...
హైదరాబాద్...
-మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన జి హెచ్ ఎం సి స్టాండింగ్ కమిటీ సమావేశం
-వరద నీటి సమస్య ను పరిష్కరించుటకు నాలాల నిర్మాణం, రిపేర్లు, అభివృద్ధి,రక్షణ చర్యలకు రూ 298 కోట్లతో 472 పనులు
-చేపట్టుటకు ఉత్తర్వులు జారీ చేయించిన రాష్ట్ర మంత్రి తారక రామారావు కు ధన్యవాదములు తెలిపిన జి హెచ్ ఎం సి స్టాండింగ్ కమిటీ
- 1 Oct 2020 1:59 PM GMT
Telangana updates: రాహుల్, ప్రియాంకలపై పోలీసుల దాడిని ఖండించిన సీఎల్పీ నేత భట్టి..
-ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న
-మాజీ కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ని యూపీ పోలీసులు అడ్డుకుని దాడి చేయడాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు.
-యోగి ప్రభుత్వం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇలా అప్రజాస్వామికంగా వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయమని,
-ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వం తన వైఫలలు కప్పుపుచుకోవాలని అనుకోవడం దేశ ప్రజలు హర్శించారని,
-ఇప్పటికైనా యోగి, మోడీ ప్రభుత్వం గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలి.
- 1 Oct 2020 1:41 PM GMT
Karimnagar district updates: కొత్త రెవెన్యూ చట్టం పై అవగాహనా సమావేశం నిర్వహించిన మంత్రి గంగుల కమలాకర్..
కరీంనగర్ :
కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి కరీంనగర్ రూరల్ మండల సర్పంచులు,ఎంపిటిసి లు, గ్రామా పంచాయితీ సెక్రటరీ లతో కొత్త రెవెన్యూ చట్టం పై అవగాహనా సమావేశం నిర్వహించిన మంత్రి గంగుల కమలాకర్
గంగుల కమలాకర్ కామెంట్స్..
-చాలా చోట్ల పేద ప్రజల ఆస్తుల హక్కులపై సమస్యలు ఉన్నాయి...
-ఆ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది...
-పేద, మధ్యతరగతి ప్రజలకు ఆస్తి హక్కు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం ..
-ప్రజల నుంచి అదనంగా డబ్బు వసూలు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదు
-కేవలం ప్రజలకు వారి ఆస్తులపై హక్కులు కల్పించాలన్న ప్రయత్నమే చేస్తున్నాం
-రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలి
-ప్రభుత్వ అధికారులకు సహకరించాలి
-ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దు
- 1 Oct 2020 1:37 PM GMT
Telangana updates: అపెక్స్ కౌన్సిల్ సమావేశానికంటే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి..
చాడ వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి....
-నదీజలాల వివాదాలపై ఈనెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికంటే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి..
-పోతిరెడ్డిపాడు సామర్థం పెంపు, ప్రత్యేక రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించుకుపోతే దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు తీరని నష్టదాయకం..
-అపెక్స్ కౌన్సిల్ ఎపి తీరును ఎండగట్టేందుకు సిఎం కెసిఆర్ కసర్తు చేయడం అభినందనీ యం..
-త్వరలో ఉప ఎన్నిక జరగన్ను దుబ్బాక నియోజకవర్గంలో బిజెపిని ఓడించడమే లక్షంగా పని చేస్తాం..
-ఆ ప్రాంతంలో గ్రామాలలో సిపిఐ పార్టీ శాఖలు, బీడీ, హమాలీ , భవన నిర్మాణ కార్మిక సంఘాలు ఉన్నాయి..
-గ్రాడ్యుయేట్ ఎంఎల్ ఎన్నికల్లో ప్రజల గొంతు వినిపించే అభ్యర్థులు ఎన్నిక కావాలి..
-అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అందరూ నిర్దోషులేనని సిబిఐ ప్రత్యేక కోర్టు తేల్చడం అన్యా యం..
-ఇన్ని సంవత్సరాల విచారణ అనంతరం దోషులను తేల్చకపోవడంతో ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది..
- 1 Oct 2020 1:30 PM GMT
Bhadradri Kothagudem district updates: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విలేకరుల సమావేశం..
భద్రాద్రికొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం....
-యూపీలో అత్యంత దారుణంగా లైంగిక దాడికి గురైన బాలిక మృతదేహాన్ని అర్ధరాత్రి దొంగచాటుగా దహనం చేసిందే కాక,
-ఆ బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేత అని కూడా చూడకుండా పోలీసులు అడ్డుకోవటమే కాక
-చొక్కా పట్టుకొని కింద పడేయడం అమానీయమైన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.
- 1 Oct 2020 1:23 PM GMT
Telangana updates: రాహుల్, ప్రియాంక గాంధీ ల పై యూపీ పోలీసు తీరుని తీవ్రంగా ఖండిస్తున్న జగ్గారెడ్డి..
జగ్గారెడ్డి...ఎమ్మెల్యే..
-పరామర్శించడానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా కింద పడేస్తారా..!
-యూపీ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.
-ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సింది పోయి పరామర్శించడానికి వెళ్ళిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణం.
-జాతీయ స్థాయిలో దీని పై కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకోవాలి
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire