Live Updates: ఈరోజు (01 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 01 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 01 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పౌర్ణిమ: రా.01-05 వరకు తదుపరి | ఉత్తరాభాద్ర నక్షత్రం తె.05-39వరకు తదుపరి | వర్జ్యం: మ.01-56 నుంచి 03-41వరకు | అమృత ఘడియలు: రా.12-24నుంచి 02-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ. 02-28 నుంచి 03.15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 1 Oct 2020 3:30 PM GMT
Chittoor district updates: ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్..
చిత్తూరు..
అర్బన్ జిల్లా యస్.పి ఏ.రమేష్ రెడ్డి..
-శ్రీ కాళహస్తి ఆలయంలో గన్ మిస్ ఫైర్ అయిన ఘటనలో ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
-ఆలయ గార్డ్ డ్యూటీ విధులు నిర్వహిస్తుకే.సుబ్రమణ్యం ఏ.ఆర్ హెచ్.సి 1234 అజాగ్రత్త వళ్ళ ఆయుధం మిస్ ఫైర్ అయినట్లు నిర్దారణ
-ఘటనకు భాధ్యునిగా చేస్తూ సస్పెన్షన్
-విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
- 1 Oct 2020 3:24 PM GMT
Amaravati updates: ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన అర్జున అవార్డీ..
అమరావతి..
-క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్జున అవార్డీ
-తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ సాత్విక్ ను అభినందించి
-మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మంత్రి పినిపె విశ్వరూప్
- 1 Oct 2020 3:21 PM GMT
Visakha updates: ఆర్కే బీచ్ రోడ్డులో ఆగ్రహజ్వాలలు..
విశాఖ..
-ఉత్తర ప్రదేశ్ లో దళితయువతి దారుణంపై ఆర్కే బీచ్ రోడ్డులో ఆగ్రహజ్వాలలు.
-ప్రధాని మోడీ దిష్డిబొమ్మను దగ్దం చేసిన కాంగ్రెస్ శ్రేణులు..అడ్డుకున్న పోలీసులు
-నిరసన లో పాల్గొన్న పిసిసి చీఫ్ శైలజానాధ్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.
- 1 Oct 2020 1:46 PM GMT
Tirumala updates: మాఢ వీధుల్లో ఈ సారి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
తిరుమల..
-పరిమితంగా సంఖ్యలో భక్తులకు అనుమతించి వాహనసేవలు
-ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి సమీక్ష
-గరుడ సేవతో పాటు అన్ని వాహనసేవలకు దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతి
-ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు ఉంటాయి.
-బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన అక్టోబరు 21న సాయంత్రం పుష్పక విమానసేవ, అక్టోబరు 23న స్వర్ణరథం ఊరేగింపు కూడా ఉంటాయి.
-గ్యాలరీల్లో థర్మల్ స్క్రీనింగ్‌తోపాటు ఫుట్ ఆపరేటెడ్ శానిటైజర్లు ఏర్పాటు.
-భక్తులందరికీ అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు.
-తగినన్ని లడ్డూలు తయారీ సిద్దమౌతున్న టిటిడి
-కల్యాణవేదిక వద్ద ఫలపుష్ప ప్రదర్శన, ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు.
- 1 Oct 2020 12:42 PM GMT
Amaravati updates: సోము వీర్రాజు బి.జె.పి. అధ్యక్షులు పత్రిక ప్రకటన..
అమరావతి..
-సిపిఐ నారాయణ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం
-బాబ్రీ మసీదు కూల్చివేతలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి కుట్రచేశారనడం సరి కాదు
-ఉమాభారతి ముందుండి నడిపించారని, ఆమె ఆ నృత్యాలు చేశారని నారాయణ మాట్లాడటం సమంజసం కాదు
-దేశంలో మొదటి నుంచీ హిందువులకు వ్యతిరేకంగా, ఇతర మతాలపై బుజ్జగింపు రాజకీయాలు చేసే కమ్యూనిస్టులకు ఈ తీర్పు రుచించదు
-అందుకే పేపర్లలో నారాయణ రంకెలేస్తూ, నృత్యాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు
-అద్వానీ, జోషి, ఇతర నాయకులు ఆ వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చివేయమని ఆదేశించడం మీరు చూశారా?
-సీబీఐ ఈ కేసులో నిస్పక్షపాతంగా తీర్పు ఇచ్చింది
-బీజేపీ సీనియర్ నాయకులపై కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేసిన తప్పుడు అభియోగాలు శుద్ధ అబద్దాలుగా ఈ తీర్పు ద్వారా వెల్లడైంది
-పవన్ కల్యాణ్, బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని విమర్శించే హక్కు మీకు లేదు.
-కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకోలేని పార్టీ దేశంలో ఏదైనా ఉందా? మీరు చెప్పాలి.
-కాంగ్రెస్, ఎన్టీఆర్, చంద్రబాబులతో మీరు పొత్తు పెట్టుకోలేదా?
-మీకు జ్ఞాపకశక్తి లేదా లేక చరిత్రపై అవగాహన లేదా?
-పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని, నిబద్దతను ప్రశ్నించే ముందు మీరు గతంలో ఆయనతో పొత్తు పెట్టుకున్నప్పుడు అతని వ్యక్తిగత విషయాల గురించి తెలియలేదా?ఆరోజు మీ మతిభ్రమించిందా?
-2014లో పవన్ కల్యాణ్ బీజేపీ, తెలుగుదేశంతో కలసి పొత్తు పెట్టుకుని విజయం సాధించాం.
-తక్షణం బాబ్రీ మసీదు కేసుపై మీ వ్యతిరేకతను, పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులను వ్యతిరేకిస్తూ చేసిన మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి
- 1 Oct 2020 12:31 PM GMT
Vijayawada updates: చక్కెర కర్మాగారాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ..
విజయవాడ..
* విజయవాడ సీఆర్ డీఏ కార్యాలయంలో సమావేశమైన మంత్రులు మేకపాటి, బొత్స, కన్నబాబు
* చక్కెర ఫ్యాక్టరీలు త్వరలో మొదలు పెట్టాలి
*భీమసింగి షుగర్ ఫ్యాక్టరీలో పరికరాలు చాలా కాలం నాటివి
* చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో సామర్థ్యానికి తగ్గట్లు పని చేయడం లేదు
* జిల్లాలవారీగా చెరకు పంట, ఉత్పత్తి వివరాలు సేకరించాలి : మంత్రి మేకపాటి, కన్నబాబు, బొత్స సత్యనారాయణ
* మరమ్మతులు చేసి, అవసరమైన పరికరాలు సమకూర్చుకోవాలి. అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి.
* ఏటికొప్పాక ఫ్యాక్టరీపై ఆధారపడిన 4500 మంది చెరకు రైతుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సహకరించాలన్న మంత్రి వర్గ ఉపసంఘం.
* సమావేశంలో పాల్గొన్న, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, షుగర్స్ డైరెక్టర్ వెంకటరావు,తదితరులు
- 1 Oct 2020 12:28 PM GMT
Amaravati updates: గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు చేరువ అయ్యాయి..
అమరావతి..
-ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
-గాంధీ జయంతి నాడు అనేకమంది రాజకీయ నాయకులు గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడుతారు
-కానీ సీఎం జగన్ ఆచరించి చూపించారు
-రేపటికి గ్రామ, వార్డు సచివాలయాలు పెట్టీ ఏడాది పూర్తి అవుతుంది
-ఒకటో తారీకున తెల్లవారక ముందే ఇంటికి వెళ్లి అవ్వ తాతలకు పెన్షన్ అందిస్తున్నాం
-ప్రధాన మంత్రి స్వయంగా సచివాలయ వ్యవస్థను అభినందించారు
-పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తున్నాం... గతంతో పోలిస్తే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు
-లోకేష్ పంచాయతీ రాజ్ మంత్రిగా ఉండి సాధించింది ఎంటి
-చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ది చేశాం అని చెప్పుకుంటారు
-హైదరాబాద్ ను ఆ సమయంలో ఎవరున్నా అభివృద్ది చేసేవారు
-చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజ్ కట్టారా? జగన్ 16 కాలేజీలు కడుతున్నారు
-చంద్రబాబు పై స్టే వెకెట్ చేస్తే అవినీతి బయటపడుతుంది
- 1 Oct 2020 12:21 PM GMT
Amaravati updates: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
అమరావతి..
-పెన్షన్ విషయంలో జగన్ రెడ్డి గారి మోసాలు అన్నీ ఇన్నీ కావు.
-అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల పెన్షన్ అన్నారు.
-మాట మార్చి,మడమ తిప్పి ప్రతి ఏడాది పెన్షన్ రూ.250 పెంచుతూ పోతానన్నారు.
-జూలై నుండి రూ.2500 పెన్షన్ ఇవ్వాల్సి ఉన్నా తాత్సారం చేస్తున్నారు.
-ఇప్పటికే అవ్వా, తాతలు రూ.1000 నష్టపోయారు.
-సంక్షేమ క్యాలెండర్ లో అవ్వా, తాతల పెన్షన్ పెంపు ప్రస్తావన లేకపోవడం దారుణం. టిడిపి ఐదేళ్లలో రూ.200 పెన్షన్ ని రూ.2000 వేలకు పెంచింది.
-వైసీపీ నేతలు వెయ్యి పెన్షన్ ని రూ.2250 చేసామంటూ సిగ్గు వదిలి అసత్య ప్రచారం చేస్తున్నారు.
-తేదీ.30.5.2019 న జగన్ రెడ్డి గారి మొదటి సంతకం ప్రకారం జారీ చేసిన జిఓ.103 లో 2 వేల పెన్షన్ ని రూ.2250 కి పెంచుతున్నట్టు ఎందుకు ఉందో సమాధానం చెప్పాలి
-ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ ని పెంచి జూలై నుండి ఉన్న బకాయిలు పెన్షనర్లకు చెల్లించాలి.
- 1 Oct 2020 12:17 PM GMT
Amaravati updates: కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ..
అమరావతి..
-అమరావతి రాజధాని అంశంపై హైకోర్ట్ లో సిపీఐ తరఫున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.
-1953లో మద్రాస్ నుండి ఆంధ్రప్రదేశ్ విడివడినప్పుడు కూడా విజయవాడలో రాజధాని పెట్టాలని సిపీఐ కోరింది.
-రాష్ట్ర విభజనానంతరం విజయవాడ-గుంటూరు మధ్య ఏపీ రాజధాని ఉండాలని సిపీఐ 2014 జూన్ లోనే ప్రకటించింది.
-అమరావతి రాజధానిగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు అనువైన ప్రదేశం.
-ప్రాంతాలమద్య వైషమ్యాలు తగదు.
-ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల అభివృద్దికి తగు చర్యలు చేపట్టాలి - రామకృష్ణ
- 1 Oct 2020 12:13 PM GMT
Vijayawada updates: దుర్గగుడి వెండిసింహాల అదృశ్యం కేసులో పోలీసుల పురోగతి!
విజయవాడ..
-జూన్ 26 న రెండు వెండి సింహాల ప్రతిమలు మాయం అయినట్టు గుర్తించిన పోలీసులు
-జూన్ 29న మిగిలిన రెండు వెండి సింహాలు దొంగిలించే ప్రయత్నంలో మరో వెండి సింహం ప్రతిమ అదృశ్యం అయినట్లు గుర్తించిన పోలీసులు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire