Ayodhya Ram Mandir Bhumi Pujan Live Updates: అయోధ్య రామ మందిరం భూమి పూజ లైవ్ అప్ డేట్స్!

శతకోటి భారతీయుల ఎన్నో ఏళ్ల కల! ఆదర్శ పురుషునికి ఆలయ నిర్మాణం. గుండెల్లో కొలువైన రాములోరికి ఇలలో గుడి కట్టాలనే సంకల్పం. ఎన్నో అవాంతరాలు.. మరెన్నో వివాదాలు..అన్నిటినీ దాటుకుంటూ వచ్చిన మధుర క్షణాలు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మరికొన్ని గంటల సమయంలో భూమి పూజ జరగబోతోంది. ఈ సందర్భంగా ఆ అపురూప ఘట్టానికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమాచారాన్నీ ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తున్నాం!
Show Full Article

Live Updates

  • 5 Aug 2020 3:56 AM GMT

    రామమందిరం నిర్మాణ భూమి పూజ వేదిక ఇలా!

    అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం మరి కొద్ది గంటల్లో జరగనుంది. ఈ సందర్భంగా అక్కడ అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. వేదిక.. ఎలావుందో ఈ ఫోటోలలో చూడొచ్చు. 



     



     



  • 5 Aug 2020 3:45 AM GMT

    రామమందిరం భూమి పూజ సందర్భంగా మోహన్ బాబు ట్వీట్!

    రామమందిరం భూమి పూజ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.



  • 5 Aug 2020 3:39 AM GMT

    28 ఏళ్ల తరువాత అయోధ్యకు ప్రధాని మోడీ!

    ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో కాలు పెట్టి 28 ఏళ్ళు అయింది. అప్పట్లో త్రిరంగా యాత్ర కోసం అయోధ్య వచ్చిన మోడీ.. మళ్ళీ ఇప్పుడు ప్రధాని హోదాలో రామ మందిరం నిర్మాణానికి శ్రీకారం చుట్టడానికి అక్కడ అడుగుపెడుతున్నారు.

                                                                                                                                                                                                   పూర్తి వివరాలు 

  • రాములోరి ఆలయానికి భూమిపూజ కొద్ది సేపట్లో..
    5 Aug 2020 2:50 AM GMT

    రాములోరి ఆలయానికి భూమిపూజ కొద్ది సేపట్లో..

    భూమి పూజకు శ్రీకారం వెనుక..

    అయోధ్యలో రామాలయం భూమిపూజ ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన ఈరోజు నిర్వహించనున్నారు.అపురూపంగా నిర్మించనున్న ఈ ఆలయ విశేషాలతో పాటు.. ఆలయం నిర్మాణానికి పడిన అడుగుల వెనుక విశేషాలు సంక్షిప్తంగా..

    - ప్రపంచంలోనే మూడో అతిపెద్ద గుడి

    - నిర్మాణ వ్యయం రూ.300 కోట్లు..

    - శంకుస్థాపనకు పుణ్యనదుల నుంచి జలాలు

    - తొలి ఆహ్వానం ముస్లిం ప్రముఖుడికి.. బాబ్రీ కేసు కక్షిదారు అన్సారీకి అందజేత

    - రాముడి కోరిక కావచ్చు.. అందుకే అందుకున్నా అంటూ వ్యాఖ్యానించిన అన్సారీ 

    - అతిథుల కుదింపు.. వేదికపై మోదీ సహా ఐదుగురే!

    - ఆన్‌లైన్‌లో ఆడ్వాణీ, జోషీ హాజరు.. పటిష్ఠ ఏర్పాట్లు

    - ఆహ్వాన పత్రిక ఉంటేనే ప్రాంగణంలోకి అనుమతి

    - బృహత్తర రామాలయానికి అయోధ్యలో భూమిపూజ

    ఆలయ నిర్మాణానికి సాగిన ప్రస్థానం ఇదే..

    - ఆడ్వాణీ రథయాత్రతో ఉద్యమానికి రాజకీయ రూపు

    - తర్వాత రెండేళ్లకే బాబ్రీ విధ్వంసం

    - 30 ఏళ్లుగా రాముడి చుట్టూనే రాజకీయం

    - 70 ఏళ్లుగా కోర్టుల్లో నలిగిన కేసు

    -  అంతిమంగా తెరదించిన సుప్రీంకోర్టు

    - శ్రీరాముడికి అనుకూలంగా తీర్పు

    దీంతో ఆలయ నిర్మాణానికి భూమిపూజను ఈరోజు వైభవంగా నిర్వహిస్తున్నారు.


Print Article
Next Story
More Stories