AP Panchayat Elections 2021 Live Updates: ఏపీ పంచాయతీ ఎన్నికలు లైవ్

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసింది. నాలుగో విడతగా ఎన్నికల్లో 2,743 సర్పంచి, 22,423 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 6.30 గంటలకు మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్‌ జరిగింది. దీంతో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన 13,097 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తి అవుతాయి. పంచాయతీ ఎన్నికల నలుగోదశ పోలింగ్ అప్ డేట్స్ ఎప్పటి కప్పడు hmtv live updates అందిస్తోంది.

Show Full Article

Live Updates

  • 21 Feb 2021 4:51 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    ప్రకాశం జిల్లా:

    * యర్రగొండపాలెం మేజర్ గ్రామపంచాయితీలో ఉద్రిక్తత.

    * అధికార ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట.

    * పోలింగ్ బూతుల సమీపంలో వేసిన టెంట్ లోనుండి ఇరువర్గాలను బయటికి పంపే విషయంలో తలెత్తిన వివాదం.

    * తెలుగుదేశం మద్దతుదారలను వెళ్ళగొట్టే ప్రయత్నం చేసిన పోలీసులు.

    * అధికార, ప్రతిపక్షం అనే తేడా చూడకుండా అందరిని వెళ్ళగొట్టాలని ఆందోళనకు దిగిన గ్రామస్ధులు

  • 21 Feb 2021 4:49 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    పశ్చిమ గోదావరి జిల్లా:

    * పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 14.12 శాతం పోలింగ్ నమోదు

  • 21 Feb 2021 4:48 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    విజయవాడ:

    * ఇప్పటి వరకూ పోలింగ్ శాతం 13.42%

  • 21 Feb 2021 4:47 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    విజయనగరం:

    * జిల్లా వ్యాప్తంగా పది మండలాల్లో ప్రశాంతంగా తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్

    * ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో 22.5 శాతం పోలింగ్ నమోదు

  • 21 Feb 2021 4:47 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    తూర్పుగోదావరి జిల్లా:

    * గ్రామ పంచాయతీ ఎన్నికలు 4వ.దశ పోలింగ్ శాతం(21-02-2021,

    * ఉదయం 8.30 గం.లకు)

    * అమలాపురం డివిజన :8.58%

    * జిల్లా ఎన్నికల సమాచార కేంద్రం

  • 21 Feb 2021 4:45 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    శ్రీకాకుళం:

    రణస్థలం మండలం

    పాతర్ల పల్లి పంచాయితీ

    * తమ సొంత గ్రామం పాతర్ల పల్లి లో ఓటు వేసిన ఏచర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ కుమార్

  • 21 Feb 2021 4:34 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    విజయనగరం జిల్లా:

    విజయనగరం జిల్లాలో పంచాయతి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పది మండలాల పరిధిలో జరుగుతున్న పోలింగ్‌లో ఓటర్లు పాల్గొని ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు

  • 21 Feb 2021 4:17 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    ప్రకాశం జిల్లా:

    ఎర్రగొండపాలెం

    * ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ మద్ధతుదారుల మధ్య తోపులాట జరిగింది. పోలింగ్‌ బూతు సమీపంలో వేసిన టెంట్‌లో నుంచి ఇరువర్గాలను బయటకు పంపే విషయంలో వివాదం తలెత్తింది. తమరిని ఒక్కరినే కాదంటూ.. అందరిని బయటకు పంపాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

  • 21 Feb 2021 4:01 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

     నెల్లూరు జిల్లా:

    * నెల్లూరు జిల్లాలో కురిసిన అకాల వర్షం పంచాయతీ ఎన్నికల పోలింగ్ పై ప్రభావం చూపుతోంది. ఈ తెల్లవారుజామున మూడు గంటల నుంచి పలు మండలాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఓటర్లు రాకపోవడంతో పోలింగ్ మందకొడిగా జరుగుతుంది. ఈసారి ఓటింగ్ పర్సెంట్ తగ్గే అవకాశముందని ఎన్నికల యంత్రాంగం ఆందోళన చెందుతోంది.

  • 21 Feb 2021 3:53 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    విశాఖ జిల్లా:

    విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే అదీప్ రాజ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ నుంచే ఆయన సతీమణి శీరిష సర్పంచ్‌ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాలభివృద్ధికి పాటుపడుతామంటున్న ఎమ్మెల్యే అదీప్‌ రాజ్

Print Article
Next Story
More Stories