Zebra plants: మీ ఇంట్లో ఆక్సిజన్ పుష్కలంగా లభించాలంటే.. ఈ జీబ్రా మొక్కలను పెంచండి

Zebra plant Different varieties grow in home to get oxygen
x

Zebra plants: మీ ఇంట్లో ఆక్సిజన్ పుష్కలంగా లభించాలంటే.. ఈ జీబ్రా మొక్కలను పెంచండి

Highlights

Zebra plants: ఇంటి పెరటిలో చెట్లు..ఇంట్లో ఇండోర్ మొక్కలు పెంచుకుంటే అందంతోపాటు ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే మీ ఇంట్లో ఆక్సిజన్ పుష్కలంగా లభించాలంటే జీబ్రా మొక్కలను నాటండి. జీబ్రా మొక్కల్లో 22 రకాలు ఉన్నాయి. వాటిని ఇంట్లో పెంచుకుంటే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.

zebra plant: నేటికాలంలో చాలా మంది హోంగార్డెనింగ్ ఇష్టపడుతున్నారు. చిన్న స్థలం ఉన్నా సరే అక్కడ మొక్కను నాటుతున్నారు. నగరాల్లో అపార్ట్ మెంట్లలో నివసించేవారు కుండీల్లో మొక్కలను పెంచుతున్నారు. ఇంట్లో మొక్కలను నాటితో ఇంటికి అందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని మొక్కలు ఆక్సిజన్ ను పుష్కలంగా అందిస్తాయి. అలాంటి మొక్కలను ఇంట్లో నాటుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే జర్నల్ లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం ఇండోర్ ప్లాంట్లతో మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుందని పేర్కొంది. అయితే మీరు కూడా ఇంట్లో మొక్కలను పెంచాలనుకుంటే ఈ జీబ్రా మొక్కలను ఎంచుకోండి. ఇవి చూడటానికి అందంగానూ..ఆరోగ్యానికి మేలు చేయడంలోనూ ముందుంటాయి. జీబ్రా ప్లాంట్ అనే పదం అనేక రకాలైన మొక్కలను సూచిస్తుంది. ఈ మొక్కలో 22 రకాలు ఉన్నాయి. చూడటానికి అచ్చం జీబ్రా వలే ఉంటుంది. అందుకే ఈ మొక్కకు జీబ్రా ప్లాంట్ అని నామకరణం చేశారు. ఆకుపచ్చ ఆకులపై తెల్లటి చారలు చూడటానికి అందంగా కనిపిస్తుంది. ఇంట్లో పెంచుకునేందుకు వీలుగా ఉండే కొన్ని రకాల మొక్కలను చూద్దాం.

1. హవోర్థియా రాడులా

రంగురంగుల హవోర్థియా రాడులా, శాస్త్రీయ నామం హవోర్థియోప్సిస్ అటెనువాటా వర్. ఈమొక్క మీ ఇంటికి అందాన్ని తెస్తుంది. ఈ మొక్క క్లాసికల్ గ్రీన్, వైట్ కలర్ స్కీమ్ లో ఉంటుంది. ఈ మొక్క ఆక్సిజన్ పుష్కలంగా అందిస్తుంది. ఈ మొక్కను పెంచేందుకు ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. చిన్న కుండీలో పెంచవచ్చు.

2. హాంకీ మరగుజ్జు కలబంద:

ఈమొక్క చూడటానికి అచ్చం కలబంద మాదిరి కనిపిస్తుంది. దీన్ని హాంకీ మరగుజ్జు కలబంద అని పిలుస్తారు. ఇది దక్షిణాఫ్రికాలో హాంకీ పట్టణంలో మొదటిసారిగా గుర్తించారు. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వాటిపై తెల్ల చారలు చూడగనే ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ మొక్క రంగు రంగుల పువ్వులను కూడా పూస్తుంది.

3.హవోర్తియా 'బిగ్ బ్యాండ్'

ఈమొక్కను చూస్తే నిజమైన మొక్కనా లేదా పెయింటింగ్ చేశారా అన్నట్లుగా ఉంటుంది. దీని ఆకులు అద్బుతంగా ఉంటాయి. పచ్చని ఆకులకు తెల్లని చుక్కలు పెట్టినట్లు కనిపిస్తుంది.

4. హవోర్తియా 'ఎనాన్'

హవోర్థియా 'ఎనాన్' అనేది హవోర్థియా కుటుంబంలోని ఒక ప్రత్యేకమైన చిన్న మొక్క. ఇది పెద్దగా పెరగడు. చిన్నగా భూమికి అతుక్కుపోయినట్లు కనిపిస్తుంది. ఆకుల మీద తెల్లటి చుక్కలు ఉంటాయి. ఇది వాతావరణాన్ని బట్టి రంగు మారుతుంది.

5. జీబ్రా మొటిమ

ఈ మొక్కను జీబ్రా వార్ట్ అని పిలుస్తారు.ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది. చిన్నగా మందపాటి ఆకులు, ఆకులపై తెల్లటి చుక్కలు ఉంటాయి. ఈ మొక్క పెరుగుతున్నా కొద్దీ టవర్ లా కనిపిస్తుంది. అయితే ఈ మొక్కను పెంచాలంటే సూర్యరశ్మి తప్పనిసరి.


Show Full Article
Print Article
Next Story
More Stories