Health Tips: ప్రొటీన్‌ కోసం మాంసం తిననవసరం లేదు.. ఈ పండ్లలో పుష్కలం..!

You Dont Need to eat Meat for Protein, These Fruits Provide Plenty
x

Health Tips: ప్రొటీన్‌ కోసం మాంసం తిననవసరం లేదు.. ఈ పండ్లలో పుష్కలం..!

Highlights

Health Tips: మాంసం, గుడ్లు, చేపలలో ప్రోటీన్‌ అధికంగా లభిస్తుంది.

Health Tips: మాంసం, గుడ్లు, చేపలలో ప్రోటీన్‌ అధికంగా లభిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పరిమిత పరిమాణంలో తింటే శరీరానికి ఎటువంటి హాని ఉండదు. కానీ శాఖాహారులు వీటిని తినలేరు. వారు ఇతర ప్రత్యామ్నాయా ఆహారాలని వెతకాలి. కొన్ని పండ్లు తినడం వల్ల ప్రోటీన్ పొందవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

1. నారింజ

నారింజ అద్భుతమైన పండు. ఇది రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ని కలిగి ఉంటుంది. కండరాలను బలపరిచే ప్రోటీన్ కూడా ఇందులో లభిస్తుంది. అందుకే ఆరెంజ్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం ఉత్తమం.

2. జామ

జామను సాధారణంగా జీర్ణక్రియకు ముఖ్యమైన పండుగా చెబుతారు. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే ఇందులో ప్రొటీన్లు ఉన్నాయని తెలుసు. తరిగిన జామలో దాదాపు 4.2 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. జామపండును నేరుగా తీసుకోవడం మంచిది.

3. అవకాడో

అవోకాడోలో ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఒక గిన్నె అవోకాడో తింటే శరీరానికి 4 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇందులో అనేక పోషక మూలకాలు ఉంటాయి. తగినన్ని ప్రొటీన్లు ఉండటం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.

4. కివి

కివి రుచి మనందరినీ ఆకర్షిస్తుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక కివి తినడం వల్ల దాదాపు 2.1 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇవే కాకుండా ప్రొటీన్‌ అధికంగా లభించే అనేక పండ్లు ఉన్నాయి. వాటిని డైట్‌లో చేర్చుకుంటే సరిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories