International Yoga Day 2024: యోగా చేస్తున్నారా?ముందు ఈ విషయాలు తెలుసుకోండి

International Yoga Day 2024: యోగా చేస్తున్నారా?ముందు ఈ విషయాలు తెలుసుకోండి
x

International Yoga Day 2024: యోగా చేస్తున్నారా?ముందు ఈ విషయాలు తెలుసుకోండి

Highlights

International Yoga Day 2024: యోగా చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల మీ శరీరం, కండరాలు గాయపడతాయి. ఆ జాగ్రత్తలేంటో చూద్దామా?

International Yoga Day 2024: యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసుందుకు ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. యోగా చేయడం వల్ల ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతోపాటు అనేక ప్రయోజనాలను పొందుతున్నారు. ఒక వ్యక్తి ప్రతిరోజూ యోగా చేస్తే.. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు. యోగా చేయడానికి, యోగా మ్యాట్, వాటర్ బాటిల్, యోగా బ్లాక్, యోగా స్ట్రాప్, సౌకర్యవంతమైన బట్టలు వంటి అనేక వస్తువులు అవసరం. వాటి సహాయంతో మీరు సులభంగా యోగా చేయవచ్చు. మీరు మొదటి సారి యోగా చేస్తున్నట్లయితే, మీరు కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వాటిని విస్మరించడం ద్వారా మీరు మీ శరీరం, కండరాలకు హాని కలిగే ప్రమాదం లేకపోలేదు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి:

మీ శరీరం క్రమంగా అనువైనదిగా మారుతుంది కాబట్టి, మొదటిసారి యోగా చేసే వ్యక్తులు తమ యోగాను సులభంగా ప్రారంభించాలి. మీరు ప్రారంభంలో కష్టమైన ఆసనాలు వేసి, మీ శరీరాన్ని బలవంతంగా వంచడం ప్రారంభిస్తే, అది మీ కండరాలకు గాయం అయ్యో అవకాశం ఉంటుంది.యోగా చేస్తున్నప్పుడు శ్వాస వేగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి . ఎందుకంటే ఇష్టం వచ్చినట్లుగా శ్వాస పీల్చుకోవడం, వదులడం చేస్తుంటే..మీ శ్వాసనాళంలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మీరు యోగాను మొదటిసారిగా చేస్తుంటే..నిపుణుల నుంచి సహాయం తీసుకోవడం మంచిది. అంతేకాదు యోగా చేస్తున్నప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోకూడదు. యోగా చేసే ముందు వార్మప్‌లో స్ట్రెచింగ్ వ్యాయామాలను కూడా చేర్చవచ్చు.

యోగాకు ముందు ఆహారం తీసుకోవద్దు:

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ కడుపుతో యోగా చేయడం చాలా ప్రయోజనకరం. ఖాళీ కడుపుతో ఉండటం సాధ్యం కాకపోతే, యోగా, ఆహారం మధ్య మూడు గంటల గ్యాప్ మెయింటెయిన్ చేయండి. అయితే, మీరు భోజనం తర్వాత వజ్రాసనం చేయవచ్చు. యోగా చేయడానికి నిశ్శబ్దంగా, ఆకుపచ్చగా ఉండే ప్రదేశంలో యోగా చేయండి. అంతే కాదు పచ్చదనం, పరిశుభ్రమైన ప్రదేశంలో యోగా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది . యోగా చేసేటప్పుడు బిగుతుగా ఉండే బట్టలు వేసుకోకండి . బిగుతుగా ఉండే దుస్తులు ధరించి యోగా చేస్తే మీ బట్టలు చిరిగిపోయే అవకాశం ఉంది.

మీకు అలసటగా అనిపిస్తే యోగాను వదలకూడదు:

చాలా మందికి మొదటిసారిగా యోగా చేస్తుంటే..అలసటగా అనిపిస్తుంది. యోగా చేస్తున్నప్పుడు అలసటగా ఉంటే యోగాను మానుకోకూడదు. నెమ్మదిగా సాధన చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ శరీరం క్రమంగా ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. శరీరంలో స్టామినాను నిర్మించడానికి కొంత సమయం పడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

https://www.hmtvlive.com/life-style/these-are-the-ways-to-maintain-healthy-fertility-115203

Show Full Article
Print Article
Next Story
More Stories