Health Tips: ఒత్తిడికి గురైతే బరువు పెరుగుతారా.. రెండిటి మధ్య లింక్‌ తెలిస్తే షాక్‌..!

Will you Gain Weight if you are Under Stress you will be Shocked if you Know the Link Between the Two
x

Health Tips: ఒత్తిడికి గురైతే బరువు పెరుగుతారా.. రెండిటి మధ్య లింక్‌ తెలిస్తే షాక్‌..!

Highlights

Health Tips: ఒత్తిడికి గురైతే బరువు పెరుగుతారా అంటే కచ్చితంగా పెరుగుతారనే చెబుతారు.

Health Tips: ఒత్తిడికి గురైతే బరువు పెరుగుతారా అంటే కచ్చితంగా పెరుగుతారనే చెబుతారు. ఎందుకంటే ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో వివిధ రకాల మార్పులు జరుగుతాయి. శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల రకరకాల ఆహార పదార్థాలు తినాలనే కోరికలు మొదలవుతాయి. ముఖ్యంగా తీపి, కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తింటారు. ఫలితంగా బరువు విపరీతంగా పెరుగుతారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

సాధారణంగా ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే "స్ట్రెస్ హార్మోన్"ను ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ ఎక్కువ ఆకలిని కలిగిస్తుంది. అధిక చక్కెర, అధిక కొవ్వు పదార్ధాలని కోరుతుంది. చిప్స్‌, చాక్లెట్ వంటి ఆహారాలు ఎక్కువగా తింటారు. వీటి వల్ల శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి. దీంతో బరువు పెరుగుతారు. అలాగే ఒత్తిడి నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. లెప్టిన్, గ్రెలిన్ అనే హార్మోన్లని విడుదల చేస్తుంది. ఇవి కూడా మరింత ఆకలిని కలిగిస్తాయి.

ఒత్తిడిలో ఉన్నప్పుడు కొన్ని రకాల పనులు వాయిదా వేస్తాం. అందులో వ్యాయామం చేయకుండా బద్దకానికి గురవుతాం. దీంతో శరీరంలో పెరిగిన క్యాలరీలు ఖర్చుకాకపోవడంతో బరువు పెరుగుతారు. ఒత్తిడి సమయంలో సరైన ఆహారాలు తినాలనే ఆలోచన రాదు. ఆరోగ్యకరమైన ఆహారం కంటే చక్కెర, కొవ్వు పదార్ధాలు ఎక్కువగా ఉండే ఆహారాలని తినడానికి ఇష్టపడుతాం. ఈ కారణాల వల్ల బరువు పెరుగుతారు. ఒత్తిడిని కంట్రోల్‌ చేయడానికి ధ్యానం, యోగా, సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీనివల్ల బరువు కంట్రోల్‌లో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories