Health Tips: రాత్రిపూట కడుపులో గ్యాస్‌ ఏర్పడటానికి కారణాలు ఇవే..!

Why gas is produced in the stomach at night Know the reasons
x

Health Tips: రాత్రిపూట కడుపులో గ్యాస్‌ ఏర్పడటానికి కారణాలు ఇవే..!

Highlights

Health Tips: రాత్రిపూట కడుపులో గ్యాస్‌ ఏర్పడటానికి కారణాలు ఇవే..!

Health Tips: గ్యాస్ట్రిటిస్ అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. భారతదేశంలో ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. రాత్రి నిద్రకు ఉపక్రమించినప్పుడు కడుపులో గ్యాస్ లేదా అపానవాయువు ఉత్పత్తి అవుతుంది. దీంతో రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు. చాలామందికి కడుపులో మంటగా ఉంటుంది. అయితే రాత్రిపూట కడుపులో గ్యాస్ ఎందుకు ఏర్పడుతుంది. దీనికి గల కారణాల గురించి తెలుసుకుందాం.

కొందరికి రాత్రిపూట ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది. దీంతో కడుపులో గ్యాస్ ఏర్పడటం వేగంగా జరుగుతుంది.సాధారణంగా రాత్రిపూట పార్టీలు, విందులకు బయటకు వెళ్లడానికి ఇష్టపడతారు.ఈ పరిస్థితిలో సమస్య మరింత పెరుగుతుంది. విందులో ఆయిల్ ఫుడ్ తినే ట్రెండ్ పెరిగింది. ఇది కడుపుకు మంచిది కాదు.

ఆహారం జీర్ణం కావడానికి 6 గంటల సమయం పడుతుంది. అయితే సాయంత్రం స్నాక్స్‌లో ఎక్కువ నూనెతో కూడిన వాటిని తింటే రాత్రి భోజనం తర్వాత కడుపు సమస్యలు మొదలవుతాయి. ఈ కారణంగా ఉబ్బరం సమస్య వస్తుంది. రాత్రి భోజనం తర్వాత కనీసం 15 నుంచి 20 నిమిషాలు నడవండి. ఇది ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

కొందరికి ఆహారం తీసుకున్న వెంటనే మంచంపై పడుకునే అలవాటు ఉంటుంది.ఈ పరిస్థితుల్లో జీర్ణక్రియలో సమస్యలు ఏర్పడి పొట్టలో గ్యాస్ మొదలవుతుంది.మీరు రోజంతా 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగకపోతే ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది గ్యాస్ట్రైటిస్ పెరగడానికి కారణమవుతుంది. అందుకే లంచ్ , డిన్నర్ టైమింగ్ కచ్చితంగా పాటించాలి. రాత్రిపూట ఎప్పుడూ హెవీ లేదా ఆయిల్ ఫుడ్ తినవద్దు. లైట్ అండ్ ఆయిల్ ఫ్రీ డైట్ తీసుకోవడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories