Winter Dehydration: చలికాలంలో నీరు తక్కువ తాగుతారు.. దీనివల్ల చాలా పనులకు ఆటంకం..!

Why does the Body Lack Water in Winter Stay Hydrated in These Ways
x

Winter Dehydration: చలికాలంలో నీరు తక్కువ తాగుతారు.. దీనివల్ల చాలా పనులకు ఆటంకం..!

Highlights

Winter Dehydration: నీరు తాగకుండా మనిషి బతకలేడు. మన శరీరంలో దాదాపు 70 శాతం నీరే ఉంటుంది. నీరు లేకుండా శరీరంలో ఒక్కపని కూడా జరగదు.

Winter Dehydration: నీరు తాగకుండా మనిషి బతకలేడు. మన శరీరంలో దాదాపు 70 శాతం నీరే ఉంటుంది. నీరు లేకుండా శరీరంలో ఒక్కపని కూడా జరగదు. నిపుణుల అభిప్రాయం మేరకు ఆరోగ్యకరమైన వ్యక్తి ఒక రోజులో 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. కానీ చలికాలంలో ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉండడంతో చాలామంది నీరు తక్కువగా తాగుతారు. దీనివల్ల మనకు తెలియకుండానే శరీరంలో డీహైడ్రేషన్‌ మొదలవుతుంది. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీనిని నివారించాలంటే ఏం చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

డీహైడ్రేషన్ ఎందుకు వస్తుంది?

చలిలో దాహం తక్కువగా ఉంటుంది. దీని కారణంగా నీరు తాగాలని అనిపించదు. దీంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీని కారణంగా వ్యాధులు మొదలవుతాయి. ఒత్తిడికి గురికావడం, చిరాకు, విశ్రాంతి లేకపోవడం, మలబద్ధకం, తల తిరగడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల మంచి ఆరోగ్యానికి నీరు తాగడం చాలా అవసరం. నీరు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోగలం.

1. భోజనంతో పాటు నీరు తాగండి

చలికాలంలో భోజనంతో పాటు నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల శరీరంలో నీటి కొరతను దూరం చేసుకోవచ్చు. సాధారణంగా నీరు తాగాలని అనిపించకపోతే నిమ్మకాయ రసాన్ని నీళ్లలో పిండుకుని తాగవచ్చు. లెమన్ వాటర్ తాగడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

2. హైడ్రేటెడ్ ఫుడ్ తినండి

సూప్‌లు చలికాలంలో ఉపశమనాన్ని అందించడమే కాకుండా శరీరంలో నీటి స్థాయిని మెయింటెన్‌ చేస్తాయి. ఇది కాకుండా అవోకాడో, బెర్రీలు, టమోటాలు వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లు, కూరగాయలను రోజువారీ జీవితంలో చేర్చుకోవచ్చు.

3. ఎలక్ట్రోలైట్‌లను చేర్చండి

ఆహారంలో పాలు, కొబ్బరి నీరు మొదలైన ఎలక్ట్రోలైట్ పానీయాలను చేర్చండి. వ్యాయామం చేసిన తర్వాత స్పోర్ట్స్ డ్రింక్ లేదా కొబ్బరి నీరు తాగాలి. ఇది కాకుండా మీరు చిటికెడు ఉప్పు లేదా ఎలక్ట్రోలైట్ పొడిని కలుపుకొని కూడా తాగవచ్చు.

4. నీటిని తాగడం అలవాటు చేసుకోండి

శరీరాన్నిహైడ్రేట్ గా ఉంచడానికి నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఒక రోజులో ఎంత నీరు తాగాలనుకుంటున్నారో పరిమితిని సెట్ చేసుకోండి. బయటికి వెళితే మీతోపాటు వాటర్ బాటిల్ తీసుకెళ్లండి. ఆహారంలో హెర్బల్ టీ, గోరువెచ్చని నీరు, కెఫిన్ లేని పానీయాలను చేర్చుకోండి. ఇది శరీరంలో నీటి స్థాయిని మెయింటెన్‌ చేయాడానికి సహాయపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories