Diabetes: తెల్లవారుజామున రక్తంలో చక్కెరశాతం ఎందుకు పెరుగుతుంది.. ఇవే కారణాలు..?

Why Does Blood Sugar increase in the Morning Know the Reasons
x

Diabetes: తెల్లవారుజామున రక్తంలో చక్కెరశాతం ఎందుకు పెరుగుతుంది.. ఇవే కారణాలు..?

Highlights

Diabetes: తెల్లవారుజామున రక్తంలో చక్కెరశాతం ఎందుకు పెరుగుతుంది.. ఇవే కారణాలు..?

Diabetes: డయాబెటిక్ పేషెంట్లు డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడల్లా ఉదయం బ్లడ్ షుగర్ టెస్ట్ రిపోర్టు అడుగుతారు. దీని వెనుక అసలు కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి ఉదయం పూట గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. ఇది మన శరీరంలో జరిగే సాధారణ ప్రక్రియ. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

ఉదయాన్నే శరీరంలో కొన్ని హార్మోన్ల మార్పులు జరుగుతాయి. మధుమేహం ఉన్నా లేకపోయినా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతూనే ఉంటుంది. శరీరం అన్ని పనులని సమతుల్యం చేయడానికి ఎక్కువ ఇన్సులిన్‌ను స్రవిస్తుంది. మధుమేహం ఉంటే ఎంత కఠినమైన డైట్ చార్ట్‌ని అనుసరించినా రాత్రి భోజనం, అల్పాహారం మధ్య చక్కెర స్థాయి పెరుగుతుంది. ఈ రోగుల శరీరంలో ఇన్సులిన్ సాధారణంగా పని చేయదు.

ఉదయం రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి కారణాలు

1. ఎక్కువ లేదా తక్కువ ఔషధం తీసుకోవడం

2. ముందు రోజు రాత్రి శరీరంలో తగినంత ఇన్సులిన్ లేకపోవడం

3. పడుకునే ముందు కొన్ని తీపి పదార్థాలను తినడం

శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ పెరిగితే నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఇది కిడ్నీ వ్యాధి, గుండెపోటు వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. సాయంత్రం ఏదైనా తేలిక ఆహారం తీసుకోవాలి. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య రాత్రి భోజనం చేయాలి. తర్వాత వెంటనే పడుకోవద్దు. బదులుగా కొంచెం నడవడానికి ప్రయత్నించాలి. డాక్టర్ సలహా లేకుండా ఏ ఔషధం తీసుకోవద్దు. ఎందుకంటే ఆ ఔషధం చక్కెరను పెంచవచ్చు. రాత్రిపూట ఏదైనా తీపి తినకూడదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories