Arthritis: ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది.. లక్షణాలు ఏంటి..?

why does arthritis occur what are the symptoms
x

Arthritis: ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది.. లక్షణాలు ఏంటి..?

Highlights

Arthritis: ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది.. లక్షణాలు ఏంటి..?

Arthritis: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల సమస్య మొదలవుతుంది. ఈ పరిస్థితిలో ఈ నొప్పిని తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఇది ఆర్థరైటిస్ ప్రారంభ లక్షణం కావచ్చు. ఇప్పుడు కీళ్లనొప్పులు వృద్ధాప్యంలో మాత్రమే వస్తాయని కాదు. ఇప్పుడు అన్ని వయసుల వారికి వస్తున్నాయి. నిజానికి శరీరంలోని కీళ్ల నొప్పుల సమస్యను ఆర్థరైటిస్‌ అంటారు. అయితే ప్రతి రకమైన కీళ్ల నొప్పులు ఆర్థరైటిస్ కాదు. ఇది ఏదైనా గాయం వల్ల లేదా శరీరంలో పోషకాహార లోపం వల్ల జరగవచ్చు. కాబట్టి ఆర్థరైటిస్ ప్రారంభ లక్షణాలు దాని రకాలు ఏంటో తెలుసుకుందాం.

ఆర్థరైటిస్‌లో రెండు రకాలు ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటోడార్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్‌లో కీళ్ల కణజాలాలు చాలా గట్టిగా మారతాయి. ఎముకల చివరలను కప్పి ఉంచే కణజాలం చనిపోవడం ప్రారంభమవుతుంది. లేచి కూర్చున్నప్పుడు లేదా కదలిక సమయంలో కీళ్లలో నొప్పి రావడానికి ఇదే కారణం. మరోవైపు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎముకలకు సంబంధించిన వ్యాధి. దీనిలో శరీరం రోగనిరోధక వ్యవస్థ కీళ్లపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఈ వ్యాధి ప్రారంభం కీళ్ల రెండు ఎముకల పొర నుంచి లేదా చివర్ల నుంచి ప్రారంభమవుతుంది.

జాయింట్స్ లో మోషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దీని వల్ల మొబిలిటీ పెరుగుతుంది. వ్యాయామం వల్ల కండరాలు బలపడతాయి. దాంతో, జాయింట్స్ పై ప్రెజర్ తగ్గుతుంది. యోగా వంటివి ప్రాక్టీస్ చెయాయడం వాళ్ళ కూడా స్ట్రెంత్ తో పాటు ఫ్లెక్సిబిలిటీను తిరిగి పొందగలుగుతారు. తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో తగినంత విశ్రాంతి అవసరం. సరైన నిద్ర వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. నొప్పితో పాటు అలసట కూడా తగ్గుతుంది.

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories