Sushmita Sen: సుస్మితా సేన్ కి హార్ట్ ఎటాక్ ఎందుకు వచ్చింది.. ఈ అలవాట్లే కారణమా..?

Why did Sushmita Sen get a Heart Attack is it Caused by These Bad Habits Know the Full Details
x

Sushmita Sen: సుస్మితా సేన్ కి హార్ట్ ఎటాక్ ఎందుకు వచ్చింది.. ఈ అలవాట్లే కారణమా..?

Highlights

Sushmita Sen Heart Attack: బాలీవుడ్‌ నటి సుస్మితాసేన్‌ వయసుని ఇప్పటికీ ఎవరూ ఊహించలేరు.

Sushmita Sen Heart Attack: బాలీవుడ్‌ నటి సుస్మితాసేన్‌ వయసుని ఇప్పటికీ ఎవరూ ఊహించలేరు. ఈ 47 ఏళ్ల నటి కొద్ది రోజుల క్రితమే గుండెపోటుకి గురైంది. సినిమా కారిడార్లలో ఈ చర్చ ఇంకా నడుస్తోంది. బాలీవుడ్ క్వీన్ సుస్మితా సేన్ ప్రతిరోజూ యోగా, వ్యాయామంతో పాటు డైట్‌పై పూర్తి శ్రద్ధ తీసుకుంటుంది. ఇదే ఆమె ఫిట్‌నెస్ రహస్యం. కానీ సుస్మితా సేన్ చాలా కాలం పాటు ధూమపానం చేయడం వల్ల ఆమెకు పెద్ద సమస్య ఎదురైంది. ఒక వ్యాధి కారణంగా సుస్మితా సేన్ అడ్రినల్ గ్రంథి సరిగ్గా పనిచేయదు. దీని కోసం స్టెరాయిడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ కారణాల వల్ల గుండెపోటు

డాక్టర్ ప్రకారం ఫిట్‌గా కనిపించడం, ఆరోగ్యకరమైన గుండెకి చాలా తేడా ఉంటుంది. మీరు యోగా, వ్యాయామం చేస్తే ఫిట్‌గా ఉంటారు. కానీ కొన్ని కారణాల వల్ల గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు ధూమపానం, మద్యపానం ఎక్కువగా అలవాటు ఉంటే గుండెపోటు సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి వల్ల కూడా గుండెపోటు సంభవిస్తుంది. ఇది కాకుండా కుటుంబంలో ఎవరికైనా ముఖ్యంగా తల్లిదండ్రులకు గుండె జబ్బులు ఉంటే అది పిల్లలలో కూడా సంభవిస్తుంది. దీంతోపాటు మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతాయి.

గుండె పరిస్థితిని చెక్ చేయండి..

ఎలక్ట్రో-కార్డియో-గ్రామ్ టెస్ట్ ద్వారా గుండె పరిస్థితిని తెలుసుకుంటారు. దీనిని సంక్షిప్తంగా ECG అని పిలుస్తారు. గుండె చప్పుడును ECGలో విద్యుత్ తరంగాల రూపంలో చూడవచ్చు. ఈ తరంగాల ద్వారా గుండె జబ్బులని నిర్ధారిస్తారు. ఇది కాకుండా మీరు ఎకో-కార్డియో-గ్రామ్ టెస్ట్ కూడా చేయవచ్చు. ఇందులో గుండె పని చేసే సామర్థ్యం గురించి తెలుస్తుంది. గుండె కోసం ట్రెడ్‌మిల్ పరీక్ష కూడా నిర్వహిస్తారు. దీని కోసం రోగి ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తాలి లేదా నడవాలి. శారీరక శ్రమ సమయంలో గుండెపై ఒత్తిడి ఎలా ఉంటుందో నమోదవుతుంది.

30 తర్వాత సాధారణ పరీక్షలు

35 నుంచి 40 సంవత్సరాల వయస్సు తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి ఈ పరీక్షలన్నీ చేయించుకోవాలి. ఊబకాయం సమస్యతో బాధపడుతుంటే, రక్తపోటు సాధారణం కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉంటే, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా ఎక్కువగా ఉంటే, మీరు 30 సంవత్సరాల వయస్సులోపు గుండె చెకప్ చేయించుకోవాలి. మీ తల్లిదండ్రులకు లేదా మీ కుటుంబంలోని ఇతర బంధువులకు గుండె జబ్బులు ఉంటే లేదా వారికి గుండెపోటు వచ్చినట్లయితే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories