White Hair: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఈ ఒక్కటి చేస్తే చాలు..!

White Hair Turns Black When Applied With Henna Powder in Mustard Oil
x

White Hair: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఈ ఒక్కటి చేస్తే చాలు..!

Highlights

White Hair: పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి, మారుతున్న జీవనశైలి ప్రభావం ముఖం నుంచి జుట్టు వరకు కనిపిస్తుంది.

White Hair: పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి, మారుతున్న జీవనశైలి ప్రభావం ముఖం నుంచి జుట్టు వరకు కనిపిస్తుంది. ప్రస్తుతం చిన్న వయసులోనే చాలామందికి జుట్టు రాలడం, నెరిసిపోవడం కనిపిస్తుంది. దీంతో అసంతృప్తితో జీవనం కొనసాగిస్తున్నారు. వీరు వెంట్రుకలను సరిగ్గా చూసుకోకపోవడం వల్లే ఈ సమస్య మొదలవుతుంది. మరికొన్ని సార్లు జన్యులోపాల వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ వాటిని తిరిగి నల్ల రంగులోకి మార్చుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చడానికి వాటికి రంగు వేయడానికి బదులుగా సహజ పద్ధతులను ఉపయోగించాలి. మస్టర్డ్ ఆయిల్ తెల్ల జుట్టు నల్లబడటానికి అత్యంత ప్రభావవంతమైన హోం రెమెడీగా చెప్పవచ్చు. ఆవనూనెలో హెన్నా పౌడర్‌ను కలిపి తెల్లటి జుట్టుకు మసాజ్ చేయడం వల్ల జుట్టుకు బలం చేకూరడమే కాకుండా అవి మళ్లీ నల్లగా మెరుస్తాయి. ఆయుర్వేదం ప్రకారం ఆవనూనెను అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో బట్టతల తొలగిపోవడంతో పాటు జుట్టు బలంగా, నల్లగా తయారవుతుంది. దీనిని మరింత ప్రభావవంతంగా చేయడానికి 1 కప్పు ఆవాల నూనె, 3 టేబుల్ స్పూన్ల గోరింట పొడి లేదా వాటి ఆకులను తీసుకోండి.

గ్యాస్ మీద గిన్నెపెట్టి అందులో ఆవాల నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత మంటను ఆర్పండి. అప్పుడు అందులో హెన్నా పౌడర్ కలపాలి. నూనె మరిగే వరకు నిరంతరం కలుపుతూ ఉండాలి. నూనె పూర్తిగా నల్లగా అయ్యాక గోరింట కరిగిపోతుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి. దానిని ఒక గంట పాటు మూత పెట్టి ఉంచాలి. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసి సీసాలో పోయాలి. తరచుగా అప్లై చేస్తూ ఉంటే కొన్నిరోజుల్లో జుట్టు నల్లగా మారుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories