Health Tips: ఉప్పులో చాలా రకాలు.. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలిస్తే షాక్‌ అవుతారు..!

Which Salt Is More Beneficial For Health You Will Be Surprised To Know The Answer
x

Health Tips: ఉప్పులో చాలా రకాలు.. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలిస్తే షాక్‌ అవుతారు..!

Highlights

Health Tips: ఉప్పు శరీరానికి చాలా అవసరం. కానీ మితంగా తీసుకోవాలి ఎక్కువగా వాడటం వల్ల అనర్థాలు ఏర్పడుతాయి. వాస్తవానికి ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరంలోని కణాలు సక్రమంగా పనిచేస్తాయి.

Health Tips: ఉప్పు శరీరానికి చాలా అవసరం. కానీ మితంగా తీసుకోవాలి ఎక్కువగా వాడటం వల్ల అనర్థాలు ఏర్పడుతాయి. వాస్తవానికి ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరంలోని కణాలు సక్రమంగా పనిచేస్తాయి. ఇది ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడటంలో సహాయపడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి వ్యక్తి రోజూ 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. అయితే గణాంకాల ప్రకారం భారతీయ ప్రజలు 11 గ్రాముల ఉప్పును వినియోగిస్తున్నారు. ఇది WHO మార్గదర్శకాల కంటే చాలా ఎక్కువ. మార్కెట్‌లో చాలా రకాల ఉప్పు దొరుకుతుంది. అయితే ఏ ఉప్పు తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం.

సాధారణ ఉప్పు

టేబుల్ సాల్ట్ అంటే సాధారణ ఉప్పు. ఇది ప్రతి ఇంటి వంటగదిలో ఉంటుంది. ఉప్పులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి అశుద్ధమైన కణమూ ఇందులో ఉండదు. దీన్ని తయారు చేయడానికి అనేక ప్రక్రియల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. పిల్లల అభివృద్ధికి టేబుల్ సాల్ట్ చాలా ముఖ్యం. అయితే ఎక్కువ ఉప్పు హాని కలిగిస్తుంది.

కల్లు ఉప్పు

ప్రతి ఉపవాసం, పండుగ సమయంలో రాక్ సాల్ట్ తింటారు. దీనిని పింక్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. దాదాపు 84 రకాల మినరల్స్ ఇందులో ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ముఖ్యమైనవి. శరీరంలో చక్కెర స్థాయిని, రక్త కణాల pH స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతాయి. కండరాల నొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి.

సముద్ర ఉప్పు

నీటిని ఆవిరిగా మార్చే ప్రక్రియ ద్వారా సముద్ర ఉప్పును తయారు చేస్తారు. ఇందులో సోడియం తక్కువ, అయోడిన్ అధికంగా ఉంటుంది. ఈ ఉప్పు త్వరగా కరుగుతుంది.

నల్ల ఉప్పు

నల్ల ఉప్పు తయారీలో అనేక రకాల సుగంధ ద్రవ్యాలు, చెట్ల బెరడులను ఉపయోగిస్తారు. అపానవాయువు, మలబద్ధకం, ఆమ్లత్వం, కడుపు తిమ్మిరి నుంచి ఉపశమనాన్ని అందించడంలో నల్ల ఉప్పు ఉపయోగకరంగా ఉంటుంది.

ఏ ఉప్పు ప్రయోజనకరం

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం తక్కువ సోడియం ఉన్న ఉప్పు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. సముద్రం, రాతి ఉప్పు రెండూ ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రెండింటిలోనూ తక్కువ సోడియం ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories