Health Tips: పాలిచ్చే తల్లులు ఏమి తినాలి ఏమి తినకూడదు.. పూర్తి డైట్‌..!

What to Eat and What Not to Eat for Lactating Mothers Know Complete Diet
x

Health Tips: పాలిచ్చే తల్లులు ఏమి తినాలి ఏమి తినకూడదు.. పూర్తి డైట్‌..!

Highlights

Health Tips: తల్లిపాలు బిడ్డకి ఒక వరం లాంటివి. ఇందులో శిశువుకి అవసరమయ్యే అన్నిపోషకాలు లభిస్తాయి.

Health Tips: తల్లిపాలు బిడ్డకి ఒక వరం లాంటివి. ఇందులో శిశువుకి అవసరమయ్యే అన్నిపోషకాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధుల నుంచి రక్షిస్తాయి. నవజాత శిశువు అభివృద్ధికి తోడ్పడుతాయి. అందుకే ప్రతి ఒక్క మహిళ డెలివరీ అయిన తర్వాత బిడ్డకి పాలని అందించాలి. అయితే తల్లి ఆరోగ్యం బిడ్డ ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. అందుకే పాలిచ్చే తల్లులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

కెఫిన్‌ పానీయాలకి దూరం

పాలిచ్చే తల్లులు ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి ప్రయత్నించాలి. దీనివల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. పిల్లలకి తృప్తిగా కడుపు నిండుతుంది. పాలిచ్చే తల్లులు కెఫిన్‌ ఉండే పానీయాలకి దూరంగా ఉండాలి. రోజువారీలో భాగంగా కొంతమంది ఏమీ ఆలోచించకుండా టీ, కాఫీలు తాగుతారు. కెఫిన్ అధికంగా ఉండటం వల్ల నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కెఫీన్‌తో కూడిన పదార్థాలు తక్కువగా తీసుకోవాలి.

ఆల్కహాల్‌ను ముట్టుకోవద్దు

పాలిచ్చే తల్లులు ఆల్కహాల్ ముట్టుకోవద్దు. మద్యం లేదా మాదకద్రవ్యాలను వినియోగించినట్లయితే శిశువుకి పాలు ఇవ్వకూడదు. మద్యానికి పూర్తిగా దూరంగా ఉండటం మంచిది.

ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌

పాలిచ్చే తల్లులు ఆహారంలో వాల్‌నట్‌లు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌ను చేర్చుకోవాలి. బాదంపప్పును ఆహారంలో చేసుకోవాలనుకుంటే రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. పోషకాలు అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్ శరీరానికి బలాన్ని అందిస్తాయి.

అరటి, అత్తి పండ్లు

పాలిచ్చే తల్లులు ఆహారంలో అరటిపండు, అంజీర్‌ను చేర్చాలి. అంజీర పండ్లను పాలలో ఉడికించి తినాలి. అయితే ఎక్కువగా తీసుకోకూడదని గుర్తుంచుకోండి.

మెంతులు

పాలిచ్చే తల్లులు ఆహారంలో మెంతులని చేర్చుకోవాలి. వీటితో టీ తయారు చేసి తాగవచ్చు. మెంతులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. తద్వారా తిమ్మిరి వంటి సమస్యలు దరిచేరవు.

Show Full Article
Print Article
Next Story
More Stories