Health Tips : కిడ్నీలో రాళ్లు కరగాలంటే ఎలాంటి ఫుడ్స్ తినాలి..ఎలాంటి ఫుడ్స్ తినకూడదో తెలుసుకోండి

What kind of foods should be eaten to dissolve kidney stones
x

Health Tips : కిడ్నీలో రాళ్లు కరగాలంటే ఎలాంటి ఫుడ్స్ తినాలి..ఎలాంటి ఫుడ్స్ తినకూడదో తెలుసుకోండి

Highlights

Health Tips : కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడేవారు కూడా ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కిడ్నీలో రాళ్లసమస్యతో చికిత్స పొందుతున్న వారు ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి. వారు ఎలాంటి ఆహారాలు తినాలి? ఏ పదార్థాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

Health Tips : కిడ్నీలో రాళ్లు అనేవి ఈ మధ్యకాలంలో చాలా మందిలో కనిపిస్తున్న వ్యాధిగా చెప్పవచ్చు. ఈ సమస్య స్త్రీల కంటే పురుషులలోనే ఎక్కువగా కనిపిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడినప్పుడు తీవ్రంగా కడుపు నొప్పి వస్తుంది. ఈ నొప్పి ఏ రేంజ్ లో ఉంటుందంటే తట్టుకోలేనంతగా ఉంటుంది. కిడ్నీలో రాళ్లను తొలగించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. కొన్నిసార్లు శస్త్ర చికిత్స కూడా అవసరం అవుతుంది. ఈ శస్త్ర చికిత్సలో లేజర్ పద్ధతి ద్వారా కూడా కిడ్నీలో రాళ్లను తొలగిస్తారు.

అయితే కిడ్నీలో రాళ్లు చాలా రకాలుగా ఉంటయి. కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడేవారు కూడా ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కిడ్నీలో రాళ్లసమస్యతో చికిత్స పొందుతున్న వారు ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి. వారు ఎలాంటి ఆహారాలు తినాలి? ఏ పదార్థాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

ఈ ఫుడ్స్ తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడవు:

నీరు:

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఎక్కువగా నీళ్లు తాగాలి. రాళ్ల కారణంగా మూత్ర విసర్జన కష్టమవుతుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ప్రతిరోజూ 8-10 గ్లాసుల నీరు త్రాగాలి.

సిట్రస్ పండ్లు:

ద్రాక్ష, నారింజ, నిమ్మ వంటి సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. ఇది కిడ్నీలో కాల్షియం పేరుకోవడం ద్వారా రాళ్లు ఏర్పడకుండా నియంత్రిస్తుంది.

తక్కువ ఆక్సలేట్ ఉండే ఫుడ్స్ :

యాపిల్స్, అరటిపండ్లు, చెర్రీస్, కాలీఫ్లవర్, దోసకాయలు, టొమాటోలు తక్కువ ఆక్సలేట్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. ఇవి మూత్రంలో ఆక్సలేట్ స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చు.

అధిక ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారాలు :

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పీచు పదార్థం ఎక్కువగా ఉండే కూరగాయలను తినాలి. పప్పులు కూడా తీసుకోవచ్చు.

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.:

సోడియం అధికంగా ఉండే ఆహారాలు:

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు సోడియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకూడదు. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. సాల్ట్ ఎక్కువగా ఉండే స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినవద్దు.

అధిక ఆక్సలేట్ ఆహారాల :

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఉల్లిపాయలు, బాదం, చాక్లెట్, టీ, కాఫీ, సోయా ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఇవి కిడ్నీలో రాళ్ల ముప్పును పెంచుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories