Pre-Diabetes: ప్రీ-డయాబెటిస్ అంటే ఏమిటీ.. లక్షణాలు ఎలా ఉంటాయి..?

What is pre-diabetes What are the Symptoms
x

Pre-Diabetes: ప్రీ-డయాబెటిస్ అంటే ఏమిటీ.. లక్షణాలు ఎలా ఉంటాయి..?

Highlights

Pre-Diabetes: దేశంలో డయాబెటిస్ రోజు రోజుకి విస్తరిస్తోంది.

Pre-Diabetes: దేశంలో డయాబెటిస్ రోజు రోజుకి విస్తరిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీని బారిన పడుతున్నారు. ప్రపంచంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు మధుమేహం సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్‌కు ముందు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీనిని వైద్య భాషలో బోర్డర్‌లైన్ డయాబెటిస్ అంటారు. దీనినే ప్రీ-డయాబెటిస్ అని కూడా పిలుస్తారు. అంటే శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని అర్థం.

ఒక అంచనా ప్రకారం 15 నుంచి 30 శాతం ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు రాబోయే 3 నుంచి 5 సంవత్సరాలలో మధుమేహం బారిన పడవచ్చు. ప్రీ-డయాబెటిస్ లక్షణాల గురించి తెలుసుకుందాం. బోర్డర్‌లైన్ డయాబెటిస్‌లో దృష్టి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో మానవుడి కళ్లపైనా ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు తలనొప్పి, అస్పష్టమైన దృష్టి ఉంటుంది. బోర్డర్‌లైన్ డయాబెటిస్ వల్ల శరీరం మరింత అలసిపోయి బలహీనంగా అనిపించవచ్చు. అలసట కారణంగా ఏ పనిలోనైనా ఏకాగ్రత కష్టమవుతుంది.

అకస్మాత్తుగా అధిక బిపి, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీని కారణంగా మీరు మైకము, అలసట, అధిక కోపం, చెమట వంటి లక్షణాలు ఉంటాయి. ప్రీ డయాబెటీస్‌లో ప్రారంభ లక్షణాలను గుర్తించడం చాలా కష్టం. కానీ పాదాలలో వచ్చే మార్పులను బట్టి గుర్తించవచ్చు. చాలా సందర్భాలలో పాదాలలో నొప్పి, జలదరింపు, తిమ్మిరి వంటి సమస్యలు ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి మార్పులను విస్మరించవద్దు.

Show Full Article
Print Article
Next Story
More Stories