బోలు ఎముకల వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలా నియంత్రించాలి..?

What is osteoporosis learn how to control it with diet
x

బోలు ఎముకల వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలా నియంత్రించాలి..?

Highlights

బోలు ఎముకల వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలా నియంత్రించాలి..?

Osteoporosis: వయసు పెరిగే కొద్ది పురుషులు, మహిళల్లో ఎముకలు బలహీనంగా మారుతాయి. దీనికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం. అదేవిధంగా అధిక బరువు లేదా ఊబకాయం కూడా ఎముకలను ప్రభావితం చేస్తుంది. చెడు జీవనశైలి కీళ్లపై ఒత్తిడిని తీసుకొస్తుంది. ఇది బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. ఎముకల సాంద్రత, ద్రవ్యరాశి తగ్గడం వల్ల బోలు ఎముకల వ్యాధి వస్తుంది. బలహీనమైన ఎముకలు పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉండాలంటే ఏం తినాలో, ఏం తినకూడదో తెలుసుకుందాం.

సోడా, కెఫిన్ పానీయాలకు దూరం

కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం నుంచి కాల్షియం బయటికి వెళ్లిపోతుంది. కాబట్టి కాఫీ తక్కువగా తాగాలి. రోజుకు 4 కప్పుల కాఫీని తాగితే ఎముకలకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అంతకంటే ఎక్కువగా తీసుకోకూడదు. అదేవిధంగా కొన్ని అధ్యయనాలు ఎక్కువ సోడా తాగే వ్యక్తులు తక్కువ ఎముక ఖనిజ సాంద్రతను కలిగి ఉంటారని తేల్చారు. అందుకే సోడా తాగడం కూడా తగ్గించాలి.

అధిక ఉప్పుకి దూరం

ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల మూత్రం నుంచి కాల్షియం బయటికి వెళుతుంది. ఇది ఎముకల నష్టానికి కారణమవుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారం, బేకరీ ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉన్నందున వాటిని తినడం మానుకోవాలి. రోజుకు కనీసం 2,300 మి.గ్రా సోడియం తీసుకోవాలి. రోజువారీ ఉప్పులో 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఆహారాలను నివారించాలి.

చక్కెర తగ్గించాలి

ఎక్కువ చక్కెర తీసుకోవడం ఎముకల ఆరోగ్యానికి హానికరం. ఎక్కువ చక్కెర మానవ శరీరం నుంచి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియాన్ని బయటకి పంపిస్తుంది. భోజనం, చక్కెర పానీయాలు, స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలని తినడం మానుకుంటే మంచిది.

మద్యం

ఆల్కహాల్ శరీరం, ఎముకల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థరైటిస్ అండ్ మస్క్యులోస్కెలెటల్ అండ్ స్కిన్ డిసీజెస్ (NIAMSD) ప్రకారం.. ఆల్కహాల్ వినియోగం శరీరంలో కాల్షియం, విటమిన్ డి శోషణ ప్రక్రియను దెబ్బతీస్తుంది. ఇది కాకుండా ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.ఎముకలు ఎక్కువ కాలం దృఢంగా ఉండాలంటే మంచి డైట్‌ పాటించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories