Side Effects of Chia Seeds: మంచివని చియా గింజలు అధికంగా తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా..

Side Effects of Chia Seeds
x

Side Effects of Chia Seeds

Highlights

Side Effects of Chia Seeds: ఎన్నో లాభాలున్న చియా గింజలతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

చియా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చియా గింజల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ గుండెకు మేలు చేస్తాయి. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇలా ఎన్నో లాభాలున్న చియా గింజలతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చియా గింజలను అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* రక్తపోటును అదుపుచేయడంలో చియా గింజలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిసిందే. ఇందులోని పొటాషియం బీపీని కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది. అలా అని వీటిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవని అంటున్నారు. చియా గింజలను అధికంగా తీసుకుంటే లోబీపీ బారిన పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అందుకే తరచూ లోబీపీతో బాధపడేవారు చియా గింజలను మితంగా తీసుకోవాలని చెబుతున్నారు.

* డయాబెటిస్‌తో బాధపడేవారికి చియా గింజలు ఎంతో ఉపయోగపడతాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అయితే పరిమితికి మించి చియా గింజలను తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ను తేడా వస్తుందని నిపుణులు అంటున్నారు.

* కొందరికి చియా గింజల ద్వారా చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే స్కిన్ ర్యాషెస్‌ వంటి సమస్యలతో బాధపడేవారు చియా గింజలను మితంగా తీసుకోవడం ఉత్తమం.

* చియా గింజలు ఫైబర్‌ కంటెంట్‌కు పెట్టింది పేరు. అందుకే చియా గింజలను మోతాదుకు మించి తీసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు వెంటాడే అవకాశం ఉంటుంది. అజీర్తి, గ్యాస్‌ వంటి సమస్యలు వస్తాయి.

* చియా గింజలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీలతో పాటు బరవూ పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకే వీటిని ఎట్టి పరిస్థితుల్లో మోతాదుకు మించి తీసుకోకూడదని చెబుతుంటారు.

నోట్‌: ఈ వివరాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించినవి మాత్రమే. వీటిని కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories