పానీపూరి వల్ల అనారోగ్యం కాదు ఆరోగ్యం కూడా.. ఇది మీకు తెలుసా..?

what are the benefits of eating  Panipuri
x

పానీపూరి వల్ల అనారోగ్యం కాదు ఆరోగ్యం కూడా.. ఇది మీకు తెలుసా..?

Highlights

పానీపూరి ఈ పేరు చెబితే చాలు చాలా మంది నోట్లో నీళ్లూరిపోతాయి. చాలా మందికి పానీపూరి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్.

పానీపూరి ఈ పేరు చెబితే చాలు చాలా మంది నోట్లో నీళ్లూరిపోతాయి. చాలా మందికి పానీపూరి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పానీపూరిని ఇష్టంగా తింటుంటారు. పానీపూరి బండి కనిపిస్తే చాలు.. వెంటనే దాని దగ్గర ఆగిపోతుంటారు. కొందరికి పానీపూరి అంటే అంత పిచ్చిమరి. అయితే చాలామంది పానీపూరి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అనుకుంటుంటారు. అయితే దీని వల్ల అనారోగ్య కాదు.. ఆరోగ్యం కూడా ఉందంట. మరి పానీపూరి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.

పానీపూరి ఆరోగ్యానికి మేలు చేస్తుందని మీకు తెలుసా.. అవును మీరు వింటున్నది నిజమే.. ఇన్ని రోజులు పానీపూరి ఆరోగ్యానికి మంచిది కాదని విన్నాం. కానీ అది కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలుసా..?. పానీపూరిలో ఉపయోగించే పుదీనా, జీలకర్ర

ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. పానీపూరిలో ఉండే బంగాళా దుంపలు, శనగలు శరీరానికి అవసరమైన పోషకాలతో పాటు శక్తిని అందిస్తాయి. పుదీనా, జీలకర్ర మనస్సును ఉత్తేజితం చేస్తాయి. మంచి ప్రొడక్టివిటీని అందించడంలో సహాయపడతాయి

అయితే పానీపూరి తీసుకోవడానికి ముందు అనేక జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. పానీపూరి తినేటప్పుడు అది స్వచ్ఛమైన పరిసరాల్లో తయారైందా లేదా అని చెక్ చేసుకోవాలి. పానీ పూరీ కోసం ఉపయోగించే నీరు శుభ్రంగా ఉండాలి. పానీపూరి ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. పరిమితంగా తినడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories