low carb ketogenic foods: లో కార్బ్ కీటోజెనిక్ ఫుడ్స్ అంటే ఏంటి..వీటితో హెల్త్ బెనిఫిట్స్ ఇవే

What are Low Carb Ketogenic Foods..These are the Health Benefits of These
x

 low carb ketogenic foods: లో కార్బ్ కీటోజెనిక్ ఫుడ్స్ అంటే ఏంటి..వీటితో హెల్త్ బెనిఫిట్స్ ఇవే

Highlights

low carb ketogenic foods: లో కార్బోహైడ్రేట్ కీటోజెనిక్ ఆహారాల్లో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఈ డైట్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

low carb ketogenic foods:లో కార్బోహైడ్రేట్ ఫుడ్స్ కొన్ని సంవత్సరాలుగా పోషకాహార నిపుణులు సూచిస్తున్న డైట్ చార్టుల్లో ప్రముఖ స్థానంలో ఉంటున్నాయి. కొంతమంది ఈ ఆహారం కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని వీటిని తింటే గుండె జబ్బులకు కారణమవుతుందని పేర్కొంటున్నారు. కానీ చాలా శాస్త్రీయ అధ్యయనాలలో, లో కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఆరోగ్యకరమైనవిగా నిరూపించారు. బరువు తగ్గాలనుకునే వారుకీటోజెనిక్ లో కేలరీ ఆహారంతో బరువు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. లో కార్బోహైడ్రేట్ కీటోజెనిక్ ఆహారాల్లో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఈ డైట్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

లో కార్బ్ కీటోజెనిక్ ఫుడ్స్ ఇవే:

చేపలు, ఇతర సీ ఫుడ్స్, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, అవకాడోలు, చికెన్, కోడి గుడ్లు, అన్ని రకాల గింజలు, నెయ్యి, వెజిటేబుల్ ఆయిల్స్, పెరుగు, బెర్రీలు, డార్క్ చాక్లెట్ వంటివి ఉంటాయి.

ఆకలిని తగ్గిస్తాయి:

అధిక ఆకలి డైట్ ప్లాన్‌కు అతిపెద్ద శత్రువు. ఆకలిని తగ్గించుకోవడానికి ఎంత ప్రయత్నించినా కొందరి వల్ల సాధ్యం కాదు. కానీ లో కార్బోహైడ్రేట్ ఆహారం తినడం ద్వారా మీ ఆకలి తగ్గిపోతుంది.

బరువు తగ్గడం:

కార్బోహైడ్రేట్లను తగ్గించడం అనేది బరువు తగ్గడానికి సులభమైన మార్గం. లో కార్బోహైడ్రేట్ ఫుడ్స్ లో కొవ్వు ఆహారం కంటే వేగంగా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. లో కార్బోహైడ్రేట్ ఆహారం మీ శరీరం నుండి అదనపు నీటిని తొలగించడానికి పని చేస్తుంది. ఇది ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తుంది. మీరు ఒకటి రెండు వారాలలో వేగంగా బరువు తగ్గుతారు.

గుండె జబ్బుల సమస్య తొలగిపోతుంది:

HDLకొలెస్ట్రాల్‌ని మంచి కొలెస్ట్రాల్ అంటారు. మీ రక్తంలో హెచ్‌డిఎల్ స్థాయి ఎక్కువగా ఉంటే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అంత తక్కువగా ఉంటుంది.

రక్తంలో చక్కెర ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి:

లో కార్బోహైడ్రేట్ కీటోజెనిక్ ఫుడ్స్ మధుమేహం ఉన్న వారికి సహాయపడతాయి, లో కార్బోహైడ్రేట్ తీసుకోవడం రక్తంలో చక్కెర ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుందని పరిశోధకులు నిరూపిస్తున్నారు. అయితే, మీరు డయాబెటిస్ మందులు తీసుకుంటుంటే, మీ కార్బోహైడ్రేట్ తీసుకోవడంలో మార్పులు చేసే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

రక్తపోటు తగ్గవచ్చు:

లో కార్బోహైడ్రేట్ ఆహారం రక్తపోటును తగ్గించడానికి సమర్థవంతమైన మార్గం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ మూత్రపిండాల వైఫల్యం వంటి అనేక సమస్యలకు ముఖ్యమైన ప్రమాద కారకం.

మెటబాలిక్ సిండ్రోమ్:

మెటబాలిక్ సిండ్రోమ్ అనేది మీ మధుమేహం గుండె జబ్బుల ప్రమాదానికి సంబంధించిన ఒక పరిస్థితి. పొత్తికడుపు ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక ట్రైగ్లిజరైడ్స్, లో HDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories