Watermelon: వేసవికాలపు వైద్యుడు పుచ్చకాయ

Summer doctor Watermelon
x

Watermelon:(File Image)

Highlights

Watermelon: పుచ్చ‌కాయ‌ల‌ను నిత్యం తింటే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది.

Watermelon: సమ్మర్ వచ్చేసింది. అధిక వేడి, వడగాడ్పులతో సూర్యుడు కూడా తన ప్రతాపం చూపించడం మొదలెట్టాడు. ఈ టైంలో శ‌రీరానికి చ‌ల్ల‌దనాన్నిచ్చే ఆహార ప‌దార్థాల కోసం అందరూ వెతుకుతున్నారు. అయితే ఎండాకాలంలో ఎక్కువగా అందరూ తీసుకునే ఆహారం పుచ్చ‌కాయ‌లు. పుచ్చ‌కాయ‌ల‌ను నిత్యం తింటే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది. వేసవిలో ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడే పండు. ఫైన ఆకుపచ్చని రంగులో వుంటూ లోపల మాత్రం ఎర్రగా వుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 1000కి పైగా వుండే పుచ్చపండ్లలో 92శాతం నీటిని కలిగి వుంటుంది. ఇందులో పలు ఔషదీయ గుణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పుచ్చకాయను వేసవికాలపు వైద్యుడు అని కూడా పిలుస్తుంటారు. ఇందులోవున్న ఔషధ గుణాలేంటో ఓసారి మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం...

పుచ్చకాయ జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడంలో కీలక పాత్ర వహిస్తుంది. వేడి కారణంగా తలనొప్పి వస్తుంటే పుచ్చకాయలోని ఎర్రటి పదార్థాన్ని రసంలా తయారు చేసుకోవాలి. ఆ రసంలో కలకండ కలుపుకుని సేవిస్తే తలనొప్పి మటుమాయమౌతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

వేసవి కాలం ప్రారంభం కాగానే చాలామంది యువతకు విపరీతంగా మొటిమలు, పులిపిరులు, చెమట కాయలు పుట్టుకొస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు తరచూ పుచ్చకాయను సేవిస్తుండండి. పుచ్చకాయ రసాన్ని సేవిస్తుంటే శరీరంలో పెరిగిన వేడిని తగ్గిస్తుంది. దీంతో మొటిమలు, పులిపిరులు, చెమటకాయలు మటుమాయమౌతాయి. అధిక బరువును కూడా నివారించుకోవచ్చు.

పుచ్చపండును తీసుకోవడం వల్ల కండరాల నొప్పిని తగ్గించడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉన్న కొన్ని సమ్మేళనాలు కూడా ఇందులో ఉన్నాయని చెబుతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పుచ్చకాయను క్రమం తప్పకుండా తినాలని సూచించారు.

పుల్లటి తేపులు వస్తుంటే మిరియాలపొడితోపాటు నల్ల ఉప్పును కలుపుకుని పుచ్చకాయతోపాటు తింటే జీర్ణక్రియ సాఫీగా జరిగి పుల్లటి తేపులు మటుమాయమౌతాయి. అధిక రక్తపోటున్నవారు వేసవి కాలంలో లభించే ఈ పుచ్చకాయలను సేవిస్తుంటే పెరిగే అధిక రక్తపోటు అదుపులో ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సో ఇంకెందుకు ఈ సమ్మరంతా పుచ్చపండును తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

Show Full Article
Print Article
Next Story
More Stories