Watching TV: టీవీ ముందు గంటలు గంటలు గడుపుతున్నారా..!

Watching TV Increases the Risk of Depression Research has Revealed Many Things
x

Watching TV: టీవీ ముందు గంటలు గంటలు గడుపుతున్నారా..!

Highlights

Watching TV: మనిషి నిత్యం ఏదో ఒక పనిచేస్తూ ఉండాలి. లేదంటే బద్దకానికి గురై అనేక వ్యాధులు కొని తెచ్చుకుంటాడు. పనిలేకుండా కూర్చునే వారు పెద్ద ప్రమాదంలో పడుతున్నారు.

Watching TV: మనిషి నిత్యం ఏదో ఒక పనిచేస్తూ ఉండాలి. లేదంటే బద్దకానికి గురై అనేక వ్యాధులు కొని తెచ్చుకుంటాడు. పనిలేకుండా కూర్చునే వారు పెద్ద ప్రమాదంలో పడుతున్నారు. పని లేకుండా ఉండడం అంటే రోగాలను ఆహ్వానించినట్లే అవుతుంది. ఇది మన శారీరక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఒక పరిశోధనలో పనిలేనివారు చాలామంది టీవీల ముందు గంటలు గంటలు కూర్చుంటున్నారని తేలింది. దీనివల్ల కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

టీవీ చూస్తూ కూర్చోవడం వల్ల డిప్రెషన్ వచ్చే ప్రమాదం 43 శాతం పెరుగుతుంది. శారీరకంగా చురుగ్గా ఉండటం వల్ల గుండె ఆరోగ్యం, రక్తపోటు, ఊబకాయం వచ్చే మాదం తక్కువగా ఉంటుంది. ఈ పరిశోధనలో గంటల తరబడి కూర్చోవడం వల్ల వ్యాధుల ముప్పు పెరుగుతుంది. కానీ అన్ని రకాల సిట్టింగ్‌లు ఒకేలా ఉండవని చెబుతున్నారు.

UKలో నిర్వహించిన ఈ అధ్యయనంలో టీవీ చూడటం వల్ల వ్యక్తులలో డిప్రెషన్ ప్రమాదం 43 శాతం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఒకవేళ మీరు కూర్చుని మానసికంగా చురుకుగా ఉంటే అది మీకు తక్కువ హానిని కలిగిస్తుంది. కానీ ఎటువంటి పనిచేయకుండా టీవీ చూస్తూ ఉంటే మానసిక సమస్యలు పెరుగుతాయి. స్థూలకాయం సమస్య ఎదురవుతుంది.

ఇవి అనుసరించండి

ఎల్లప్పుడూ శారీరకంగా చురుకుగా ఉండండి

మానసికంగా చురుకుగా ఉండటం ముఖ్యం

మీకు టీవీ చూడటానికి ఒక సమయం ఉందని గుర్తుంచుకోండి

గంటల తరబడి టీవీ చూడవద్దు

రోజూ అరగంట పాటు వ్యాయామం చేయాలి

స్థూలకాయం, రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించండి

ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల మరణ ప్రమాదం తగ్గుతంది

మీరు ఎక్కువ కాలం జీవించగలుగుతారు

Show Full Article
Print Article
Next Story
More Stories