Rail Journey: రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వాంతులు అవుతున్నాయా.. ఇలాంటి తప్పులు చేయవద్దు..!

Vomiting While Traveling by Train Follow These Tips
x

Rail Journey: రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వాంతులు అవుతున్నాయా.. ఇలాంటి తప్పులు చేయవద్దు..!

Highlights

Rail Journey: కొంతమంది ప్రయాణ సమయంలో చాలా ఇబ్బందిపడుతారు. తరచుగా వాంతులు చేసుకోవడం, కడుపునొప్పితో బాధపడటం జరుగుతుంది.

Rail Journey: కొంతమంది ప్రయాణ సమయంలో చాలా ఇబ్బందిపడుతారు. తరచుగా వాంతులు చేసుకోవడం, కడుపునొప్పితో బాధపడటం జరుగుతుంది. ఇంకొంతమందికి కళ్లు తిరగడం, వికారం సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితిని మోషన్ సిక్‌నెస్ అంటారు. ఫ్లైట్ లేదా ఏసీ బస్సుల్లో సీట్ల ముందు సిక్‌నెస్ బ్యాగ్ ఉంచడం మీరు చూసే ఉంటారు. ఇది చాలా మంది వ్యక్తులను ప్రభావితం చేసే సాధారణ సమస్య. భారతదేశంలోని రైలు ప్రయాణికులు తరచుగా ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. అయితే కొన్ని తప్పులను నివారించినట్లయితే ఇటువంటి ఇబ్బంది ఉండదు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. డాక్టర్ వద్దకు వెళ్లాలి

మోషన్ సిక్‌నెస్ సమస్య ఉంటే డాక్టర్‌ దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవాలి. వాస్తవానికి కడుపు రుగ్మతల వల్ల వాంతులు, వికారం మొదలైనవి ఎదురవుతాయి. కాబట్టి డాక్టర్ ఇచ్చిన మందులను సరైన విధానంలో వాడితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

2. మనస్సును అదుపులో ఉంచుకోవాలి

ఇంద్రియాల కదలికలకు భిన్నంగా ఉంటే అనారోగ్యం వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హై స్పీడ్ రైలులో కూర్చున్నట్లయితే మీ మనస్సును కంట్రోల్‌లో ఉంచుకోవాలి. లేదంటే గాబారా పడుతూ చెమటలు వస్తాయి. మొత్తం భయం భయం ఉంటుంది. నిశ్చలమనస్తత్వంతో స్థిరంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు.

3. వాహనం వెళ్లే దిశలో కూర్చోవాలి

రైలు ఏ దిశలో వెళుతుందో అదే దిశలో కూర్చోవాలి. వాహనం కదలికకు భిన్నంగా ఉండే సీటుపై ఎప్పుడూ కూర్చోవద్దు. విండో సీటుపై కూర్చోకపోవడం వల్ల మోషన్ సిక్‌నెస్ సమస్య తగ్గుతాయని కొందరు చెబుతున్నారు.

4. పడుకునే సమయంలో కళ్లు తెరవకూడదు

ఒకవేళ మీరు ప్రయాణ సమయంలో పడుకుంటే కళ్లు మూసుకోవాలి. లేదంటే వైబ్రేషన్‌ కారణంగా శరీరంలో సమస్యలు ఏర్పడుతాయి. కడుపులో తిప్పినట్లుగా అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories