Children Health: పిల్లల్లో విటమిన్‌ డి లోపిస్తే ఈ వ్యాధుల ప్రమాదం.. నివారణ చర్యలు తెలుసుకోండి..!

Vitamin D Deficiency In Children Is The Risk Of These Diseases Know The Preventive Measures
x

Children Health: పిల్లల్లో విటమిన్‌ డి లోపిస్తే ఈ వ్యాధుల ప్రమాదం.. నివారణ చర్యలు తెలుసుకోండి..!

Highlights

Children Health:నేటి కాలంలో జీవన విధానం మారిపోవడం వల్ల పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారు.

Children Health: నేటి కాలంలో జీవన విధానం మారిపోవడం వల్ల పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారు. మరికొన్నిసార్లు పుట్టినప్పటి నుంచే వ్యాధులకు గురవుతున్నారు. అందుకే తల్లిదండ్రులు ఎదిగే పిల్లలను గమనిస్తూ ఉండాలి. వారి సంపూర్ణ పోషకాహారం అందించాలి. కొన్నిసార్లు పిల్లల్లో విటమిన్‌ డి లోపిస్తుంది. ఇది ఎముకల బలహీనతకు కారణమవుతుంది. అంతేకాదు దీనివల్ల చర్మ సమస్యలు కూడా ఎదురవుతున్నాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది. దీనిని నివారించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

1. కొవ్వు చేప

సాల్మన్, మాకేరెల్, ట్యూనా వంటి కొవ్వు చేపలు విటమిన్ డి అద్భుతమైన ఆహారాలు. ఈ చేపలను వారానికి రెండుసార్లు పిల్లలకు తినిపించడం వల్ల విటమిన్ డి అవసరాలను తీర్చవచ్చు.

2 గుడ్లు

గుడ్డు పచ్చసొన విటమిన్ డికి మంచి మూలం. దీనిని తినడం వల్ల పిల్లలను విటమిన్ డి లోపం నుంచి కాపాడవచ్చు. గుడ్లలో ప్రోటీన్, ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల అభివృద్ధికి బాగా తోడ్పడుతాయి.

3. పాలు

పాలలో కాల్షియం, విటమిన్ డి పెద్ద మొత్తంలో ఉంటుంది. పిల్లలకు రోజుకు 1-2 గ్లాసుల పాలు ఇవ్వడం వల్ల వారి పోషకాహార అవసరాలు తీరుతాయి. మీరు విటమిన్ డి ఫోర్టిఫైడ్ పాలను కూడా ఎంచుకోవచ్చు.

4. ఈస్ట్

ఈస్ట్‌లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. పప్పులు, కూరగాయలు లేదా సూప్‌లో ఒక చెంచా పోషకమైన ఈస్ట్‌ని కలిపి పిల్లలకు ఇవ్వవచ్చు.

5. పుట్టగొడుగులు

కొన్ని రకాల పుట్టగొడుగులు విటమిన్ డికి మంచి మూలం. పిల్లలకు పుట్టగొడుగుల కూర తయారు చేసి పెట్టవచ్చు. అయితే వాటిని ముందుగా సూర్యకాంతిలో ఉంచాలని గుర్తుంచుకోండి.

వీటిని గుర్తుంచుకోండి

విటమిన్ డి పొందడానికి ఉత్తమ సహజ మార్గం ఉదయం సూర్యకాంతి. ఉదయం 10 గంటలకు ముందు 15-20 నిమిషాల పాటు పిల్లలను సూర్యకాంతిలో ఆడుకోనివ్వాలి. దీంతో వారి చర్మం సహజంగా విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories