Health: ఈ విటమిన్ లోపిస్తే తలనొప్పి, అలసట తప్పవు..!

Vitamin B12 Deficiency Can Lead to Fatigue and Headaches
x

Health: ఈ విటమిన్ లోపిస్తే తలనొప్పి, అలసట తప్పవు..!

Highlights

Health: నేటికాలంలో అలసట, తలనొప్పి సర్వసాధారణం అయిపోయాయి. వాస్తవానికి ఈ సమస్యలు విటమిన్ల లోపం వల్ల వస్తాయి.

Health: నేటికాలంలో అలసట, తలనొప్పి సర్వసాధారణం అయిపోయాయి. వాస్తవానికి ఈ సమస్యలు విటమిన్ల లోపం వల్ల వస్తాయి. మీరు ల్యాబ్‌లో టెస్ట్ చేయించుకుంటే ఈ సంగతి తెలుస్తుంది. విటమిన్ B-12 లోపం వల్ల తలనొప్పి, అలసట ఏర్పడుతుంది. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శరీరంలో విటమిన్ బి 12 లోపం ఉన్నప్పుడు చాలా మంది మూత్రం రంగులో మార్పు ఉంటుంది. వంటి వీటితో పాటు కింది సమస్యలు కూడా ఉంటాయి.

అన్ని వేళలా అలసిపోవడం, నిరంతర తలనొప్పి, చర్మం పసుపురంగులోకి మారడం, మూత్రం ముదురు పసుపు రంగులో రావడం, నిరంతర కడుపు సమస్యలు, అజీర్ణం, గ్యాస్, గుండెల్లో మంట, ఏకాగ్రత వైఫల్యం, వాచిన ముఖం, నాలుక వాపు, పొడి లేదా పగుళ్లు, చేతులు లేదా కాళ్ళలో మంట, దృష్టి కోల్పోవడం, చేతులు, కాళ్ళ మధ్య సమన్వయం లేకపోవడం, అంగస్తంభన సమస్యలు, కండరాల నొప్పి, బలహీనత, తిమ్మిరి మొదలైన సమస్యలు ఏర్పడుతాయి.

శరీరంలో విటమిన్ B12 లోపాన్ని ఎలా భర్తీ చేయాలి..

శరీరంలో విటమిన్ B12 లోపాన్ని తీర్చడానికి రెండు సులభమైన మార్గాలను అనుసరించవచ్చు. మొదటిది మీ రోజువారీ ఆహారంలో ఈ విటమిన్ ఆహారాలని పెంచడం. మరొకటి విటమిన్ B12సప్లిమెంట్లను తీసుకోవడం. అయితే వైద్యుల సలహా లేకుండా వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. మీ సమస్యల గురించి వైద్యుడికి చెప్పండి. నిర్ణీత వ్యవధిలో సరైన లవణాలతో పాటు సరైన కంపెనీ నుంచి పర్ఫెక్ట్ సప్లిమెంట్లను తీసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories