Cockroach: బొద్దింకలతో చాలా ప్రమాదం.. కిచెన్‌ నుంచి ఇలా తరిమేయండి..!

Very Dangerous With Cockroaches Drive Them out of the Kitchen With These Simple Methods
x

Cockroach: బొద్దింకలతో చాలా ప్రమాదం.. కిచెన్‌ నుంచి ఇలా తరిమేయండి..!

Highlights

Cockroach: వంటగది మన ఇంట్లో అత్యంత ముఖ్యమైన భాగం. ఇది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి.

Cockroach: వంటగది మన ఇంట్లో అత్యంత ముఖ్యమైన భాగం. ఇది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. లేదంటే రోగాలు వ్యాప్తి చెందుతాయి. సాధారణంగా వంటగదిలో అందరు ఎదుర్కొనే సమస్య బొద్దింకలు. వీటిని ఎన్నిసార్లు తరిమికొట్టినా వస్తూనే ఉంటాయి. చాలామంది వీటిని పూర్తిగా తొలగించలేరు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే సులభమైన ఇంటి చిట్కాలు తెలుసుకోండి. వీటిని ఉపయోగించడం వల్ల ఈ సమస్యను పూర్తిగా వదిలించుకోవచ్చు.

1. లవంగాలు, వేప నివారణ

లవంగాల ఘాటైన వాసన నుంచి బొద్దింకలు పారిపోతాయి. దీని కోసం సుమారు 20 నుంచి 25 లవంగాలు మెత్తగా చేసి ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల వేపనూనె కలిపి బొద్దింకలు దాక్కున్న ప్రదేశాల్లో స్ప్రే చేయాలి. బొద్దింకలు లవంగం, వేప వాసనను భరించలేవు. దీంతో వెంటనే అవి పారిపోతాయి. తరచుగా ఈ స్ప్రేని చల్లుతూ ఉండాలి. దీంతో ఇవి కిచెన్‌లోకి అడగుపెట్టలేవు.

2. పుదీనా నూనె, ఉప్పు నివారణ

మీరు ఇంటి నుంచి బొద్దింకలను వదిలించుకోవడానికి మరొక ప్రభావవంతమైన మార్గం పుదీనా నూనెలో ఉప్పు, నీరు కలపండి. బొద్దింకలు ఉన్న ప్రదేశాలలో స్ప్రే చేయండి. వెంటనే అవి పారిపోతాయి.

3. కిరోసిన్ ఆయిల్ నివారణ

ఈ రోజుల్లో కిరోసిన్ చాలా నగరాల్లో అందుబాటులో లేదు. కానీ కొద్దిగా కిరోసిన్‌ సంపాదించి బొద్దింకలు ఎక్కడ ఉంటే అక్కడ కిరోసిన్ ఆయిల్ పిచికారీ చేయండి. ఇది గొప్ప మందులా పనిచేస్తుంది.

4. బేకింగ్ సోడా వాడకం

బొద్దింకలను వదిలించడానికి బేకింగ్ సోడాలో కొంచెం పంచదార కలపండి. బొద్దింకలు ఉన్న చోట ఉంచండి. బేకింగ్ సోడా, చక్కెరను నీటిలో కలిపి కూడా చల్లుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బొద్దింకలన్నీ తేలికగా పారిపోతాయి.

5. పగుళ్లను పూరించండి

ఇంట్లో ఉండే పగుళ్లు కీటకాలకు నిలయంగా మారుతాయి. ఈ పరిస్థితిలో ఫ్లోర్, కిచెన్ సింక్‌లో ఉన్న పగుళ్లను వైట్ సిమెంట్ సహాయంతో పూరించండి. బొద్దింకలు ఈ పగుళ్లలో దాక్కుని గుడ్లు పెడతాయి. పగుళ్లు మూసుకుపోయినప్పుడు బొద్దింకలకు చోటు దొరకదు. అవి వాటంతటవే తగ్గుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories