Urine Color: మూత్రం రంగు అకాస్మాత్తుగా నారింజ రంగులోకి మారిందా.. వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిందే..!

Urine Color Suddenly Turned Orange Very Dangerous Know About These Reasons
x

Urine Color: మూత్రం రంగు అకాస్మాత్తుగా నారింజరంగులోకి మారిందా.. వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిందే..!

Highlights

Urine Color: చాలా మంది మూత్ర విసర్జన సమయంలో దాని రంగును పట్టించుకోరు.

Urine Color: చాలా మంది మూత్ర విసర్జన సమయంలో దాని రంగును పట్టించుకోరు. అయితే మూత్రం రంగు మీ ఆరోగ్యానికి సూచికని మరిచిపోకండి. సాధారణంగా మూత్రం లేత గోధుమ రంగులో ఉండాలి. కానీ అది మందపాటి పసుపు లేదా నారింజ రంగులోకి మారినట్లయితే తీవ్రమైన వ్యాధికి గురైనట్లు అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిలో ఆలస్యం చేయకుండా నిపుణుడైన వైద్యుడిని సంప్రదించాలి. మూత్రం రంగును చెక్ చేయడానికి తెలుపు రంగు టాయిలెట్ బౌల్‌ను ఉపయోగించడం మంచిది.

ఒక రోజులో మొత్తం మూత్రం

ఒక నివేదిక ప్రకారం ఆరోగ్యవంతమైన వయోజన వ్యక్తి రోజుకు 2 లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగితే అతను 800 నుంచి 2 వేల మిల్లీలీటర్ల మూత్రాన్ని పాస్ చేయాలి. దీనివల్ల అతడు ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మూత్రంలో కొద్దిగా పసుపు రంగు రావడం సహజం. దీని గురించి ఆందోళన చెందకూడదు. కానీ ఈ రంగు నారింజ రంగులోకి మారితే అప్పుడు వైద్యుడిని సంప్రదించడంలో ఆలస్యం చేయకూడదు.

డీహైడ్రేషన్

శరీరం ఫిట్‌గా ఉండాలంటే రోజూ 2 లీటర్ల నీరు తాగడం తప్పనిసరి. ఇంతకంటే తక్కువ నీరు తాగితే డీహైడ్రేషన్ బారిన పడుతారు. ఈ పరిస్థితిలో మీ మూత్రం రంగు మందపాటి పసుపు రంగులోకి మారుతుంది. దానినుంచి నురుగు రావడం ప్రారంభమవుతుంది. ఇది ప్రోటీన్ ఉనికిని సూచిస్తుంది. అధిక ఆల్కహాల్ తాగిన తర్వాత కూడా మూత్రం రంగు మందపాటి పసుపు, నారింజ రంగులోకి మారుతుంది.

మోతాదుకు మించిన మందులు

డాక్టర్ల ప్రకారం మందులు ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా మూత్రం రంగు మారుతుంది. TB వ్యాధిలో ఉపయోగించే రిఫాంపిన్ ఔషధం మూత్రాన్ని ఎరుపు లేదా నారింజ రంగులోకి మార్చుతుంది. ఈ పరిస్థితిలో ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

సప్లిమెంట్స్

శరీరంలో విటమిన్-ఎ, బి-12, సి వంటి మూలకాల లోపాన్ని తీర్చడానికి చాలా మంది సహజ పండ్లు, కూరగాయలకు బదులుగా సప్లిమెంట్లను తీసుకుంటారు. వీటిని అనేక రసాయనాలు కలిపి తయారుచేస్తారు. చాలా సార్లు మన శరీరం ఈ కృత్రిమ పదార్ధాలను గ్రహించలేకపోతుంది. దీంతో మూత్రం నారింజ రంగులోకి మారుతుంది. ఈ పరిస్థితిలో సప్లిమెంట్లు, ఆహారపు అలవాట్ల గురించి తప్పనిసరిగా వైద్యుడికి చెప్పాలి.

కాలేయ సమస్యలు

యూరిన్ కలర్ నారింజ రంగులోకి మారడం కాలేయ వైఫల్యానికి కారణమని యూరాలజిస్టులు చెబుతున్నారు. శరీరంలో ఇది కొలెస్టాసిస్ అనే పరిస్థితికి కారణంగా జరుగుతుంది. ఇది తీవ్రమైన కాలేయ రుగ్మత అని చెప్పవచ్చు. ఇది కొన్నిసార్లు గర్భధారణ సమయంలో అభివృద్ధి చెందుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories