White Hair: మొదటిసారి తెల్లవెంట్రుకలు కనిపించాయా.. వెంటనే ఇలా ఆపండి..!

Try these tips to stop white hairs from appearing for the first time
x

White Hair: మొదటిసారి తెల్లవెంట్రుకలు కనిపించాయా.. వెంటనే ఇలా ఆపండి..!

Highlights

White Hair: మొదటిసారి తెల్లవెంట్రుకలు కనిపించాయా.. వెంటనే ఇలా ఆపండి..!

White Hair: ఒకప్పుడు జుట్టు నెరిసిపోవడాన్ని వృద్ధాప్య సంకేతంగా భావించేవారు. కానీ నేడు తెల్లజుట్టుకు వయసుతో సంబంధం లేదు. 20 నుండి 25 సంవత్సరాల వయస్సు యువత కూడా తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారు. దీని కారణంగా వారు తరచుగా ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా సార్లు జుట్టును నల్లగా మార్చడానికి రసాయన ఆధారిత హెయిర్ డైలను ఉపయోగిస్తారు. అయితే ఇది జుట్టును పొడిగా చేస్తుంది. మీ తలపై తెల్ల వెంట్రుకలు మొదటిసారి కనిపిస్తే ఏం చేయాలో తెలుసుకుందాం.

1. అనారోగ్యకరమైన ఆహారం వద్దు..

చిన్న వయస్సులో జిడ్డు, ఫాస్ట్, జంక్, స్ట్రీట్ ఫుడ్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అది మీ నాలుకకు ఎంత రుచికరంగా అనిపించినా శరీరానికి చాలా హానికరం. అవి మన ప్రేగులు, మూత్రపిండాలు, కాలేయాలను దెబ్బతీయడమే కాకుండా జుట్టు పోషణపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. పొట్ట ఆరోగ్యంగా లేకుంటే జుట్టు మీద చెడు ప్రభావం పడటం ఖాయం. బదులుగా మీరు రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోవాలి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, జింక్, ఐరన్, కాపర్ పుష్కలంగా ఉంటాయి.

2. టెన్షన్‌ తగ్గించుకోండి

మీరు ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతున్నట్లయితే శరీరంలోని అనేక భాగాలు చెడుగా ప్రభావితమవుతాయి. ఇందులో మన జుట్టు కూడా ఉంటుంది. అనవసరమైన టెన్షన్ పడకుండా సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడం మంచిది. మీరు ధ్యానం సహాయంతో ఒత్తిడిని అధిగమించవచ్చు. అప్పుడు జుట్టు తెల్లగా మారదు.

3. సిగరెట్, ఆల్కహాల్ మానుకోండి

సిగరెట్, మద్యపానం ఆరోగ్యానికి చాలా హానికరం. వీటివల్ల స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరగదు. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం మొదలవుతుంది. అందువల్ల మీరు ఎంత త్వరగా ధూమపానం, మద్యపానం మానేస్తే అంత మంచిది.

4. చురుకుగా ఉండాలి..

మెరుగైన ఆరోగ్యం కోసం శారీరకంగా చురుకుగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోతే రక్త ప్రసరణ నెమ్మదిగా ఉంటుంది. జుట్టుకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. కాబట్టి ఎల్లప్పుడూ వర్కవుట్‌లపై శ్రద్ధ వహించండి. మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories