Tongue Burn: వేడి పదార్థాలు తిన్నప్పుడు నాలుక కాలిందా.. వెంటనే ఇలా చేయండి..!

Tongue Burns When Eating Hot Food Cure it With These Tips
x

Tongue Burn: వేడి పదార్థాలు తిన్నప్పుడు నాలుక కాలిందా.. వెంటనే ఇలా చేయండి..!

Highlights

Tongue Burn: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఆహారాన్ని కూడా నెమ్మదిగా తినలేకపోతున్నారు.

Tongue Burn: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఆహారాన్ని కూడా నెమ్మదిగా తినలేకపోతున్నారు. తొందరలో వేడి వేడి ఆహారాన్ని తింటూ నాలుక కాల్చుకుంటున్నారు. ఒక్కసారి నాలుక కాలిందంటే రెండు మూడు రోజులు ఆహారాన్ని తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా కారంగా ఉండే ఆహారాలు అస్సలు తినలేరు. మీకు ఇలాంటి అనుభవం ఎదురైతే కొన్నిచిట్కాల ద్వారా కాలిన నాలుకని నయం చేసుకోవచ్చు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. కొద్దిసేపు నాలుకపై తేనె ఉంచాలి

తేనెలో అనేక రకాల ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ఇది చల్లటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది కాలిన నాలుక మంటని, చికాకును తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక చెంచా తేనెను నోటిలో కొంత సమయం పాటు ఉంచితే మంచి ఉపశమనం ఉంటుంది. కాలిన గాయాన్ని బట్టి రోజుకు రెండు మూడుస్తార్లు ఇలా చేస్తే సరిపోతుంది.

2. పెరుగు తినాలి

తేనె లేని సందర్భంలో పెరుగు చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకుంటే పెరుగు ప్రభావం కూడా చల్లగా ఉంటుంది. ఈ పాల ఉత్పత్తి నాలుకపై మంటని సులువుగా తగ్గిస్తుంది. దీని కోసం చల్లటి పెరుగును తీసుకొని నాలుక కాలని ప్రదేశంలో కొద్దిసేపు ఉంచుకోవాలి. దీంతో త్వరగా ఉపశమనం లభిస్తుంది.

3. చూయింగ్ గమ్ నమలాలి

పెరుగు కూడా లభించని సందర్భంలో చూయింగ్ గమ్ నమలాలి. ఇది నాలుక మంటని తగ్గిస్తుంది. చూయింగ్‌ గమ్‌ నమలడం వల్ల నోటిలో ఎక్కువ లాలాజలం ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా నాలుక చాలా సమయం వరకు తడిగా ఉండి క్రమంగా మంట తగ్గిపోతుంది.

4. ఐస్ క్రీం తినండి

వేడి ఆహారాలు లేదా పానీయాల కారణంగా నాలుక కాలినప్పుడు వెంటనే ఐస్‌ క్రీం తినాలి. దీనివల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. ఇది నాలుక వాపు, మంటను సులువుగా తగ్గిస్తుంది. దీని కోసం ఐస్ క్రీం చిన్న చిన్నగా చాలాసేపు తినాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories