Mahatma Gandhi Jayanti 2024: నేడు మహాత్మా గాంధీ జయంతి .. చివరి రోజులను గాంధీ ఎలా గడిపారో తెలుసుకుందాం.

Today is Mahatma Gandhi Jayanti 2024 Let us know about the last moments of Gandhiji
x

 Mahatma Gandhi Jayanti 2024: నేడు మహాత్మా గాంధీ జయంతి 2024.. చివరి రోజులను గాంధీ ఎలా గడిపారో తెలుసుకుందాం.

Highlights

Gandhi Jayanti 2024: నేడు మహాత్మాగాంధీ జయంతి. దేశవ్యాప్తంగా జాతిపిత మహ్మాత్మాగాంధీ పుట్టిన రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి వేడుకను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా మనదేశంలో ఘనంగా జరుపుకుంటున్నారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ చివరి రోజు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Gandhi Jayanti 2024: 1948 జనవరి 30వ తేదీ శుక్రవారం..ఎప్పటిలాగే ఆ రోజు కూడా గాంధీజీ తెల్లవారు జామున నిద్రలేచారు. ప్రార్థన చేసుకున్నారు. ఓ రెండు గంటలు కాంగ్రెస్ కొత్త బాధ్యతలు, విధానాలు మీద ద్రుష్టిపెట్టారు. 6గంటలకు మళ్లీ పడుకున్నారు. తర్వాత 8గంటలకు నిద్ర లేచారు. ఎప్పటిగానే ఆయనకు నూనెతో మాలిష్ జరిగింది. స్నానం చేసిన అనంతరం అల్పాహారం తీసుకున్నారు. అదే సమయానికి ఢిల్లీ నగరంలో ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్ లో నాథూరాం గాడ్సె, నారాయణ్ ఆప్టే, విష్షు కర్కరే నిద్రపోతూ ఉన్నారు. గాంధీ అల్పాహారం తర్వాత తనని కలవడానికి సరివారంగా వచ్చిన పాత స్నేహితుడు రుస్తమ్ సోరాబజీతో కాసేపు మాట్లాడారు గాంధీజీ. అనంతరం ఢిల్లీలోని ముస్లిం నాయకులను కలిశారు.

అనంతరం గాంధీ సన్నిహితుడైన సుధీర్ ఘోష, ప్యారేలాల్ కలిసి లండన్ టైమ్స్ పేపర్ లో వచ్చిన వార్త నెహ్రూ, పటేల్ మధ్యన అభిప్రాయాబేధాలపై స్పందిచాలనికోరారు. సాయంకాలం వారిద్దరి ముందూ ఈ విషయం గురించి మాట్లాడుతానని గాంధీ చెప్పారు. అక్కడ బిర్లా హౌస్ కు వెళ్లే ముందు గాడ్సేకి వేరుశనగలు తినాలనే కోరిక కలగడంతో..అతని మిత్రుడు ఆప్టే వాటిని తీసుకువచ్చి గాడ్సేకు ఇచ్చాడు. అవి తిన్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు.

సాయంత్రం 4గంటలకు వల్లభాయ్ పటేల్ తన కూతురు మనుబెన్ తో కలిసి గాంధీజీని కలిసిన ప్రార్థనా సమయం 5గంటలు దాటే వరకు మచ్చటపెట్టారు. అదే సాయంత్రం 4.15నిమిషాలకు గాడ్సే అతని మిత్రులు టాంకా ఎక్కి కనాట్ కు వెళ్లారు. అక్కడి నుంచి మరో టాంకా తీసుకుని బిర్లా హౌస్ కు వెళ్లారు. హౌస్ కు ముందు రెండు వందల గజాల దూరంలోనే టాంకా ఆపి దిగారు.

అక్కగా గాంధీ పటేల్ తో మాట్లాడుతున్నారు. ఒక చేత్తే చెరఖా, మరో చేత్తో ఆభా తెచ్చిన భోజనం చేశారు. ప్రార్థనా సభకు ఆలస్యంగా వెళ్లేందుకు ఇష్టం లేని గాంధీ పటేల్ తో మాట్లాడుతూనే జేబులో ఉన్న గడియారం తీసి సమయం చూపించే ప్రయత్నం చేశారు. అది చూసి మనుబెన్ గాంధీకి చెప్పగా ఆయన ప్రార్థన సభకు 5.10నిమిషాలకు వెళ్లారు.

తన సహాయకురాలైన ఆభా, మనులతో కలిసి నడుస్తున్న సభకు చేరుకున్నారు. అక్కడ ప్రజలకు అభివాదం చేశారు. ఇంతలోనే ఎడమవైపు నుంచి నాథూరామ్ గాడ్సే, గాంధీవైపునకు వంగి ఆయన పాదాలకు నమస్కరించబోతున్నట్లు భావించారు. అయితే గాడ్సే విసురుగా మనుని తోసుకుంటూ ముందుకు వచ్చి తుపాకీతో మూడు గుండ్లు గాంధీ ఛాతీమీద, పొట్టలోకి కాల్చాడు. గాంధీజీ రామ్ రామ్ అంటూ నేలకొరిగారు. ఆభా కిందపడిపోతున్న గాంధీ తను పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే గాంధీ ప్రాణాలు కోల్పోయారు.


Show Full Article
Print Article
Next Story
More Stories