Health Tips: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా.. రాత్రిపూట భోజనం ఎప్పుడు చేస్తారు..?

To lose Weight Change the Meal Times at Night
x

Health Tips: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా.. రాత్రిపూట భోజనం ఎప్పుడు చేస్తారు..?

Highlights

Health Tips: నేటి రోజులలో అధిక బరువు పెద్ద సమస్యగా మారింది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది స్థూలకాయులుగా మారుతున్నారు.

Health Tips: నేటి రోజులలో అధిక బరువు పెద్ద సమస్యగా మారింది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది స్థూలకాయులుగా మారుతున్నారు. దీంతో చాలా ఆరోగ్య సమస్యలని కొని తెచ్చుకుంటున్నారు. తర్వాత పశ్చాతపడి బరువు తగ్గించుకునే ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. ఇందుకోసం జిమ్‌లకి వెళ్లి కసరత్తులు చేయడం, గ్రౌండ్‌లో పరుగెత్తడం చేస్తున్నారు. కానీ ఎక్కువ రోజులు శ్రమించకపోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండటం లేదు. దీని గురించి డైటీషియన్లు ఏం చెబుతున్నారంటే ముందుగా జీవన విధానం, ఆహార విధానంలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలంటే ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. తప్పనిసరిగా క్యాలరీ ట్రాకర్‌ని ఉపయోగించాలి. తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి. బరువు తగ్గడానికి శరీరంలో అధికంగా పేరుకుపోయిన కేలరీలని బర్న్ చేయాలనే విషయం అందరికి తెలుసు. అయితే శాస్త్రీయ అధ్యయనాలు మరికొన్ని విషయాల గురించి చెబుతున్నాయి. భోజన సమయం బరువు తగ్గడానికి మధ్య ఉన్న సంబంధం గురించి తెలియజేస్తున్నాయి. బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే రాత్రిపూట భోజనం ఏ సమయానికి చేయాలో తెలుసుకోవాలి.

బరువు తగ్గే విషయానికి వస్తే మీరు ఎంత కేలరీలు వినియోగిస్తున్నారనేది గమనించాలి. అలాగే భోజన సమయాలని కూడా పరిగణలోనికి తీసుకోవాలి. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనంలో బరువు తగ్గడానికి కొంతమంది రాత్రి 7, 7:30 గంటల మధ్య భోజనం చేశారు. ఫలితాలు పాజిటివ్‌గా వచ్చాయి. అయితే రాత్రి 10:30, 11 గంటల మధ్య తిన్నవారి సమూహం బరువు తగ్గడంలో విఫలమయ్యారు. అందువల్ల రాత్రి 7 లేదా 7:30 గంటలలోపు ఆహారం తీసుకోవడం ఉత్తమం. దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories