BP Control Tips: బీపీ అదుపులో ఉండాలంటే ఇవి పాటించాలి.. లేదంటే ప్రమాదంలో పడుతారు..!

To keep BP under Control these should be followed otherwise you will be in Danger
x

BP Control Tips: బీపీ అదుపులో ఉండాలంటే ఇవి పాటించాలి.. లేదంటే ప్రమాదంలో పడుతారు..!

Highlights

BP Control Tips: ఈ వేగవంతమైన జీవనశైలిలో చాలామంది బీపీ బారినపడుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, జీవనశైలిలో మార్పుల వల్ల హై బీపీ, లో బీపీకి గురవుతున్నారు. ఇందులో హై బీపీ చాలా డేంజర్‌.

BP Control Tips: ఈ వేగవంతమైన జీవనశైలిలో చాలామంది బీపీ బారినపడుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, జీవనశైలిలో మార్పుల వల్ల హై బీపీ, లో బీపీకి గురవుతున్నారు. ఇందులో హై బీపీ చాలా డేంజర్‌. ఈ పరిస్థితిలో ధమనులలో ఉండే రక్తం అధిక ఒత్తిడిని కలిగి ఉంటుంది. ఇది గుండెపోటు, మూత్రపిండాల వ్యాధి, స్ట్రోక్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని సృష్టిస్తుంది. అయితే కొన్ని అలవాట్లను పాటించడం వల్ల బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఫిక్స్‌ టైం

ప్రతిరోజు రాత్రి నిద్రపోవడం, ఉదయాన్నే నిద్ర లేవడం ఫిక్స్‌ టైంలో చేయాలి. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇలా చేయకపోతే జీవనశైలిలో మార్పులు వచ్చి సమస్యలు పెరుగుతాయి.

గ్లాసు నీరు తాగండి

ఉదయాన్నే నిద్రలేచి ఒక గ్లాసు నీరు తాగి రోజును ప్రారంభించండి. దీనివల్ల రక్తపోటు తగ్గుతుంది. అవసరమనుకుంటే ఆ నీటిలో నిమ్మకాయ రసాన్ని కలుపుకోవచ్చు.

వ్యాయామం

ప్రతి వారం కనీసం 150 నిమిషాల పాటు చురుకైన నడక, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ చేయాలి. శారీరక శ్రమలో పాల్గొనడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. వ్యాయామం చేయడానికి ఉదయం చాలా మంచి సమయమని గుర్తుంచుకోండి.

టీ, కాఫీలు తాగవద్దు

మనలో చాలా మంది ఉదయాన్నే టీ, కాఫీలు తాగి రోజును ప్రారంభిస్తారు. అయితే వీటిలో కెఫీన్ పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా బీపీ అకస్మాత్తుగా పెరుగుతుంది. అందుకే ఇటువంటి పానీయాలకు దూరంగా ఉండటం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories