Heart Attack: హార్ట్ఎటాక్ రావొద్దంటే ఈ ఫుడ్స్ డైట్‌లో ఉండాల్సిందే..!

To Avoid Heart Attack Include These Ingredients in Food
x

Heart Attack: హార్ట్ఎటాక్ రావొద్దంటే ఈ ఫుడ్స్ డైట్‌లో ఉండాల్సిందే..!

Highlights

Heart Attack: ఈ రోజుల్లో పెరిగిన కొలస్ట్రాల్ వల్ల చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుకి గురవుతున్నారు.

Heart Attack: ఈ రోజుల్లో పెరిగిన కొలస్ట్రాల్ వల్ల చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుకి గురవుతున్నారు. అందుకే కొలస్ట్రాల్‌ని సక్రమంగా ఉంచుకోవడం అవసరం. అందుకే సరైన డైట్ మెయింటెన్ చేయాలి. ఒమేగా 3, ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్, రిచ్ విటమిన్లు, ఫైటోకెమికల్‌లు సమృద్ధిగా ఉండే ఆహారాలని తీసుకోవాలి. ఇందుకోసం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో తెలుసుకుందాం.

పండ్లు: స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటి అన్ని రకాల బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆరెంజ్, ద్రాక్ష, కాఫీ, డార్క్ చాక్లెట్, క్యాప్సికమ్, క్యారెట్, టొమాటో, బచ్చలికూరలో కూడా సమృద్దిగా ఉంటాయి. అందుకే వీటిని డైట్లో చేర్చుకోవాలి.

విటమిన్లు: విటమిన్ B కోసం పాల ఉత్పత్తులు, జున్ను తీసుకోవాలి. విటమిన్ ఏ బచ్చలికూర, క్యారెట్లు, చిలగడదుంపలలో లభిస్తుంది. విటమిన్ సి నారింజ, నిమ్మకాయలు, సీజనల్ పండ్లలో లభిస్తుంది. విటమిన్ డి పాలు, తృణధాన్యాలు, చేపలలో లభిస్తుంది. విటమిన్ E తృణధాన్యాలు, ఆకు కూరలు, డ్రై ఫ్రూట్స్‌లో లభిస్తుంది. ఇవన్నీ డైట్‌లో ఉండేవిధంగా చూసుకోవాలి.

ఒమేగా 3: ఒమేగా 3 మంచి కొవ్వుని సృష్టిస్తుంది. ఇది చేపలు, అవిసె గింజలలో ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 సోయాబీన్ ఉత్పత్తులలో ఉంటుంది. ఇది గుండెతో పాటు ఊపిరితిత్తులను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

కూరగాయలు: పండ్లు, కూరగాయలలో పైటో కెమికల్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆహారంలో రంగురంగుల కూరగాయలు, పండ్లు తినాలి. ఎరుపు, పసుపు క్యాప్సికమ్, బ్రోకలీ, బీట్‌రూట్, వంకాయ, క్యారెట్ అన్నీ ఆహారంలో చేర్చుకోవాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దెబ్బతిన్న కణాలను సరిచేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories