Belly Fat: పెరిగిన బెల్లీఫ్యాట్‌తో విసిగిపోయారా.. ఈ చిట్కాలు పాటించండి..!

Tired of Growing Belly fat Follow These Tips
x

Belly Fat: పెరిగిన బెల్లీఫ్యాట్‌తో విసిగిపోయారా.. ఈ చిట్కాలు పాటించండి..

Highlights

Belly Fat: ఈ రోజుల్లో ఊబకాయం పెద్ద సమస్యగా మారింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.

Belly Fat: ఈ రోజుల్లో ఊబకాయం పెద్ద సమస్యగా మారింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. వ్యాయామం చేయకపోవడం, కొవ్వు ఉండే ఆహారాలని ఎక్కువగా తినడం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం లాంటి కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. రోజు రోజుకి పొట్ట పెరుగుతూ చికాకు తెప్పిస్తుంది. చిన్న పిల్లలు కూడా ఊబకాయం బారిన పడి చాలా ఇబ్బందిపడుతున్నారు. దీనివల్ల హై బీపీ, మధుమేహం, గుండెపోటు, ఆస్తమా, గ్యాస్ట్రిక్ వంటి అనేక వ్యాధులు సంభవిస్తున్నాయి. అందుకే ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో వీలైనంత త్వరగా బెల్లీఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

1.ఉదయం, సాయంత్రం గ్రీన్ టీ

పెరుగుతున్న పొట్ట కొవ్వును తగ్గించుకోవడానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో కొవ్వును కరిగించే గుణాలు ఉంటాయి. మీరు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక కప్పు గ్రీన్ టీ తాగితే బెల్లీఫ్యాట్‌కి చెక్ పెట్టవచ్చు. అంతేకాదు ఇది షుగర్, డయాబెటిస్, హై బిపి వంటి అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది.

2. మరిగించిన జీలకర్ర నీరు

బెల్లీఫ్యాట్‌ని తగ్గించే రెండో దివ్యౌషధం జీలకర్ర నీరు. ఉదయమే ఒక గ్లాసు వేడినీటిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మరిగించి తాగాలి. ఇలా చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా కరుగుతుంది. అంతేకాదు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

3.సోంపు, జీలకర్ర, మెంతుల నీరు

వంటగదిలో ఉండే మెంతులు, జీలకర్ర, సోంపు బెల్లీఫ్యాట్‌ని తగ్గించడంలో చాలా సహాయపడతాయి. ఇవన్నీటిని కలిపి గ్లాసు వేడి నీటిలో కలుపుకొని తాగాలి. వెంటనే బెల్లీఫ్యాట్ అదుపులోకి వస్తుంది. బరువు వేగంగా తగ్గుతారు. అజీర్తి సమస్య దూరమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories