Thyroid: థైరాయిడ్‌ సైలెంట్ కిల్లర్.. దీనివల్ల శరీరంలో ఈ మార్పులు...

Thyroid Symptoms Treatment and Changes in the Body | Health News
x

Thyroid: థైరాయిడ్‌ సైలెంట్ కిల్లర్.. దీనివల్ల శరీరంలో ఈ మార్పులు...

Highlights

Thyroid: ఆధునిక కాలంలో ప్రజల జీవనశైలి నిరంతరం మారుతోంది...

Thyroid: ఆధునిక కాలంలో ప్రజల జీవనశైలి నిరంతరం మారుతోంది. చాలామంది ఈ రోజుల్లో బయటి ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనివల్ల అనేక వ్యాధులకి గురవుతున్నారు. చాలా మంది మధుమేహం, రక్తంలో చక్కెర, గుండెపోటు, థైరాయిడ్ వంటి వ్యాధులతో పోరాడుతున్నారు. ఈ పరిస్థితిలో మీరు మీ ఆహారం నుంచి వ్యాయామం వరకు ఎక్కువ శ్రద్ధ వహించాలి. లేదంటే ఈ వ్యాధులు తరువాత పెద్ద సమస్యగా మారవచ్చు.

కాబట్టి ఈ రోజు థైరాయిడ్ వ్యాధి గురించి తెలుసుకుందాం. దీనివల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి. చికిత్స ఎలా తీసుకోవాలి తదితర విషయాలు తెలుసుకుందాం. థైరాయిడ్ అనేది గొంతులో ఉండే 'గ్రంధి'. శరీర జీవక్రియ ఈ గ్రంథి ద్వారా కంట్రోల్‌ అవుతుంది. మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడం దీని పని. అయితే ఈ గ్రంధి వాపునకి గురైతే సమస్యలు ఏర్పడుతాయి. దీని లక్షణాలు కనిపించని కారణంగా దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు.

ఇది శరీరంలో మీ సమస్యలను పెంచుతుంది. తరచుగా చెమటపడుతుంటే జాగ్రత్తగా ఉండాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మలబద్ధకం థైరాయిడ్ లక్షణం. కొంతమందికి చాలా ఆకలిగా అనిపిస్తుంది. కొంతమంది బరువు పెరగడం ప్రారంభిస్తారు. మీకు ఈ లక్షణాలు ఉంటే మీరు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. లేదంటే భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శక్తి లేకపోవడం వల్ల ఒక వ్యక్తి అలసటగా ఉంటాడు.

ఇది కాకుండా గొంతు దగ్గర చర్మం నల్లగా మారడం ప్రారంభమవుతుంది. థైరాయిడ్ ఉన్నప్పుడు గొంతులో ఒక గడ్డ ఏర్పడుతుంది. దీని కారణంగా గొంతు పెద్దదిగా కనిపిస్తుంది. మాట్లాడటంలో ఇబ్బంది మొదలవుతుంది. గొంతు నొప్పి కూడా పెరుగుతుంది. థైరాయిడ్‌తో బాధపడే వ్యక్తికి నిద్రపట్టడంలో చాలా ఇబ్బంది ఉంటుంది. థైరాయిడ్‌ సైలెంట్‌ కిల్లర్‌ కాబట్టి వెంటనే చికిత్స తీసుకోవాలి. లేదంటే శరీరం చాలా సమస్యలని ఎదుర్కోవాల్సి న పరిస్థితులు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories