Health News: సులువుగా బరువు తగ్గడానికి 3 ఫిట్‌నెస్‌ చిట్కాలు..!

Three Fitness Tips to Lose Weight Easily | Healthy Weight Loss Tips
x

Health News: సులువుగా బరువు తగ్గడానికి 3 ఫిట్‌నెస్‌ చిట్కాలు..!

Highlights

Health News: ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఫిట్ బాడీని, సమతుల్య బరువును పొందాలని కోరుకుంటారు...

Health News: ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఫిట్ బాడీని, సమతుల్య బరువును పొందాలని కోరుకుంటారు. అయితే ఇది అందరికి సాధ్యం కాదు. దీంతో నిరాడంబరమైన శరీరంతో జీవితాన్ని గడపాల్సి వస్తుంది. వైద్యుల ప్రకారం ఫిట్ బాడీని పొందడానికి క్యాలరీలను నియంత్రించే ఆహారం తీసుకోవడం, తగినంత శారీరక శ్రమను నిర్వహించడం ముఖ్యం. ఇది కాకుండా ఆహారపు అలవాట్లు, నిద్ర అలవాట్లలో శాశ్వత మార్పులు చేసుకోవడం అవసరం. ఇలా చేయడంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు కంట్రోల్‌లో ఉంటుంది. శాశ్వత ఫిట్‌నెస్ పొందాలంటే జీవనశైలిలో 3 మార్పులు కచ్చితంగా అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

పౌష్టికాహారం: ఫిట్‌గా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది మొదటి అతి ముఖ్యమైన దశ. శరీర బరువును నియంత్రించడానికి మీరు తినే సమయాన్ని నిర్ణయించుకోండి. క్రమం తప్పకుండా అనుసరించండి. ఇలా చేయడం వల్ల మీరు సమయానికి ఆకలితో ఉంటారు. అన్ని వేళలా తినే అలవాటు నుంచి బయటపడతారు.

కార్యాచరణ: పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంపై శ్రద్ధ వహించండి. ఇలా చేయడం వల్ల అదనపు క్యాలరీలు ఖర్చవడమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వ్యాయామం చేయడానికి జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు రోజూ ౩౦ నిమిషాల స్పీడ్ వాక్ లేదా ఏరోబిక్ వ్యాయామం చేయడం ద్వారా శారీరక శ్రమ చేయవచ్చు.

మానసిక దృఢత్వంపై శ్రద్ధ

మంచి ఆరోగ్యానికి శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం అవసరం. దీని కోసం జీవితంలో పాజిటివ్‌గా ఉండటం నేర్చుకోండి. దీనివల్ల ఏదైనా సాధించవచ్చు. అన్నింటిలో మొదటిది మీరు మీ శరీర అవసరాలను గ్రహించి మీ కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఈ పని మొదట్లో కష్టంగా అనిపించినా సాధన చేయడం ద్వారా సులువుగా సాధించవచ్చు.

తక్కువ కేలరీల ఆహారాన్ని తినండి

దీనితో పాటు, మీరు తక్కువ కేలరీల ఆహారాన్ని కూడా తినేలా చూసుకోవాలి. తద్వారా బరువు పెద్దగా పెరగదు. మీరు ఫుడ్ యాక్టివిటీ యాప్‌ని ఉపయోగించి మీరు తినే ఏదైనా మానిటర్ చేయవచ్చు. మీరు పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు వంటి పోషకాలను ఎక్కువగా తినేలా చూసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories