Health Tips: ఈ కూరగాయలలో ప్రొటీన్‌ అధికం.. ఈరోజే డైట్‌లో చేర్చుకోండి..!

This Vegetable is High in Protein Add it to Your Diet Today
x

Health Tips: ఈ కూరగాయలలో ప్రొటీన్‌ అధికం.. ఈరోజే డైట్‌లో చేర్చుకోండి..!

Highlights

Health Tips: ప్రోటీన్ పొందడానికి నిపుణలు మాంసం, చేపలు, గుడ్లు తినమని సలహా ఇస్తారు.

Health Tips: ప్రోటీన్ పొందడానికి నిపుణలు మాంసం, చేపలు, గుడ్లు తినమని సలహా ఇస్తారు. కానీ మాంసాహారం తినడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే భారతదేశంలో శాకాహారులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఈ పరిస్థితిలో శాకాహారులు ప్రోటీన్ అవసరాలను కొన్ని కూరగాయలు తినడం ద్వారా తీర్చవచ్చు. ప్రతిరోజు ఇవి డైట్‌లో ఉండే విధంగా చూసుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. కాలీఫ్లవర్

కాలీఫ్లవర్‌ తినడం వల్ల శరీరానికి ప్రొటీన్ లభిస్తుంది. దీంతో పాటు పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ సమృద్ధిగా దొరుకుతుంది. ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మీరు దీన్ని క్రమం తప్పకుండా తింటే శరీరంలో ప్రోటీన్ లోపం ఉండదు.

2. బచ్చలికూర

ఆకు కూరలలో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి అధిక ప్రోటీన్ కలిగి ఉంటాయి. దీంతోపాటు విటమిన్ B, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే పాలకూరను రెగ్యులర్‌గా తినాలి.

3. బంగాళాదుంప

బంగాళాదుంపలు తినడం ద్వారా ప్రోటీన్ పొందవచ్చు. కట్ చేసిన బంగాళదుంపలను తక్కువ మంటలో వేయించాలి. దీని నుంచి ప్రొటీన్‌తోపాటు పీచు, విటమిన్‌ సి, పొటాషియం లభిస్తాయి.

4. బ్రోకలీ

మీరు మాంసం, గుడ్లు తినడానికి ఇష్టపడకపోతే బ్రోకలీ తినవచ్చు. ఇది ఆరోగ్యకరమైన కూరగాయ. ఇందులో ప్రోటీన్‌తో పాటు ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీన్ని ఉడకబెట్టడం లేదా సలాడ్‌ వేసి తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

5. పుట్టగొడుగు

పుట్టగొడుగులు ఖచ్చితంగా ఖరీదైన ఎంపిక. కానీ ఇది ప్రోటీన్‌కి గొప్ప మూలంగా చెప్పవచ్చు. దీన్ని వారానికి 3 నుంచి 4 సార్లు తింటే శరీరంలో ప్రోటీన్‌తో సహా అనేక ఇతర పోషకాలకు కొరత ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories