Vitamin B12 Vegetarian: విటమిన్ B12 కోసం మాంసం, గుడ్లు తినక్కర్లేదు.. ఈ వెజ్‌ ఫుడ్స్‌లో కూడా పుష్కలం..!

These Vegetarian Foods Are Rich In Vitamin B12 Know That
x

Vitamin B12 Vegetarian: విటమిన్ B12 కోసం మాంసం, గుడ్లు తినక్కర్లేదు.. ఈ వెజ్‌ ఫుడ్స్‌లో కూడా పుష్కలం..!

Highlights

Vitamin B12 Vegetarian: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి చాలా రకాల విటమిన్లు అవసరం.

Vitamin B12 Vegetarian: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి చాలా రకాల విటమిన్లు అవసరం. ఇందులో విటమిన్ బి-12 చాలా ముఖ్యమైనది. ఇది లోపిస్తే మెదడు, నాడీ వ్యవస్థకి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. B12 సహాయంతో ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. ఈ విటమిన్ లోపం వల్ల మానసిక సమస్యలు, ఎముకలు, కీళ్ల నొప్పులు ఏర్పడుతాయి. సాధారణంగా ఈ పోషకం మాంసం, చేపలు, గుడ్లు తినడం వల్ల లభిస్తుంది. దీనివల్ల శాఖాహారులు చింతించాల్సిన అవసరం లేదు. కొన్ని శాఖాహార ఆహారాలలో కూడా ఇది పుష్కలంగా లభిస్తుంది. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

బ్రోకలీ

విటమిన్ బి-12 శాఖాహార ఆహారాలలో బ్రోకలీ టాప్ లిస్ట్‌లో ఉంటుంది. ఇది సూపర్ ఫుడ్ కంటే తక్కువేమి కాదు. ఇందులో విటమిన్ బి12తో పాటు ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. దీని వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్య తొలగిపోతుంది.

సోయా ఉత్పత్తులు

నాన్-వెజ్ ఐటమ్స్ తినలేకపోతే సోయాలో విటమిన్ బి-12 అధికంగా లభిస్తుంది. సోయాబీన్, సోయా పాలు, టోఫు వంటి ఉత్పత్తులను తప్పనిసరిగా తినాలి.

ఓట్స్

ఓట్స్ చాలా హెల్తీ ఫుడ్ ఐటమ్. దీన్ని టిఫిన్‌గా తినడానికి ఇష్టపడతారు. ఇందులో ఉండే విటమిన్ బి12 శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునేవారు ఓట్స్ తింటే బెస్ట్‌.

పెరుగు

పెరుగు సంపూర్ణ ఆహారం. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. పెరుగులో విటమిన్ బి12తో పాటు విటమిన్ బి1, విటమిన్ బి2 కూడా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే పెరుగును ఎక్కువగా తింటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories