Weight Loss Drinks: బరువు తగ్గాలంటే ఈ మసాల పానీయాలు బెస్ట్‌..!

These Spicy Drinks are Best for Weight Loss | Weight Loss Tips
x

Weight Loss Drinks: బరువు తగ్గాలంటే ఈ మసాల పానీయాలు బెస్ట్‌..!

Highlights

Weight Loss Drinks: ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు...

Weight Loss Drinks: ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. ఎందుకంటే చాలా మందికి జిమ్‌కి వెళ్లడానికి సమయం దొరకదు. మీరు వర్కవుట్ చేయకుండానే బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలనుకుంటే మీ వంటగదే బెస్ట్‌. ఇక్కడ దొరికే 3 రకాల మసాలా దినుసుల ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. జీలకర్ర, సోంపు, ధనియాల సహాయంతో మీరు బరువు తగ్గించే డ్రింక్స్‌ని సిద్ధం చేసుకోవచ్చు. దీని కోసం ఒక గ్లాసు నీటిలో మూడు మసాలా దినుసులను ఒక చెంచా తీసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే తక్కువ మంటపై మరిగించి వడగట్టి తాగాలి. మీరు ఈ పానీయానికి నిమ్మ, నల్ల ఉప్పు కలిపితే ప్రభావం మెరుగ్గా ఉంటుంది.

సోంపు ప్రయోజనాలు

సోంపు తినడం ద్వారా వేగంగా బరువు తగ్గవచ్చు. ఇందులో పెద్ద మొత్తంలో ప్రోటీన్ లభిస్తుంది. ముఖ్యంగా ఒక టీస్పూన్ సోంపులో 20 కేలరీలు, 1 గ్రాము ప్రోటీన్, 3 గ్రాముల పిండి పదార్థాలు, 2 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇది జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. ఇది బరువును తగ్గించడంలో సహాయం చేస్తుంది.

ధనియాల ప్రయోజనాలు

ధనియాలలలో క్రిమినాశక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం నుంచి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడుతుంది. ముఖంపై అద్భుతమైన గ్లోను తీసుకొస్తుంది. ధనియాలు రక్తంలో చక్కెర స్థాయిని, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. ఇందులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళకు చాలా మేలు చేస్తుంది. ధనియాలకి జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉంది. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

జీలకర్ర ప్రయోజనాలు

జీలకర్ర యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇందులో కాల్షియం, కాపర్, ఐరన్, మాంగనీస్, జింక్, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. జీలకర్ర తినడం వల్ల మెటబాలిజం మెరుగ్గా ఉంటుంది. ఇదే బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గడానికి కారణమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories