Health Tips: ఈ వ్యక్తులు ఆరెంజ్‌ తినకూడదు.. లాభానికి బదులు నష్టం జరుగుతుంది..!

These People Should not eat Orange Instead of Profit There will be Loss
x

Health Tips: ఈ వ్యక్తులు ఆరెంజ్‌ తినకూడదు.. లాభానికి బదులు నష్టం జరుగుతుంది..!

Highlights

Health Tips: ఆరెంజ్ పండుని భారతదేశంలో చాలా మక్కువతో తింటారు.

Health Tips: ఆరెంజ్ పండుని భారతదేశంలో చాలా మక్కువతో తింటారు. దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి పేద, ధనవంతుడు దీన్ని ఆస్వాదిస్తాడు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు శరీరానికి అన్ని విధాలా మేలు చేస్తాయి. అనేక లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ ఈ పండు కొందరికి ఉపయోగకరంగా ఉండదు. దీనివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. ఎసిడిటీ వ్యక్తులు

తరచుగా ఎసిడిటీ సమస్య ఉన్నవారు నారింజ లేదా దాని రసాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఛాతీ, కడుపులో మంటను పెంచుతుంది.

2. దంతాల సమస్య

నారింజలో ఒక రకమైన యాసిడ్ ఉంటుంది. ఇది దంతాల ఎనామిల్‌లో ఉండే కాల్షియంతో కలిసి ఒక రకమైన బ్యాక్టీరియాకి కారణం అవుతుంది. దీనివల్ల దంతాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి.

3. పొత్తికడుపు నొప్పి

పొత్తికడుపు నొప్పి అనేక కారణాల వల్ల వచ్చినప్పటికీ అకస్మాత్తుగా ఈ సమస్యను ఎదుర్కొంటే వెంటనే ఆరెంజ్ తినడం మానేయాలి. ఎందుకంటే నారింజలో ఉండే యాసిడ్ సమస్యను మరింత పెంచుతుంది.

4. అజీర్ణం సమస్య

కడుపు సమస్యలు ఉన్నవారు నారింజను తినకూడదు. ఎందుకంటే ఇది విరేచనాలు, అజీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అంతేకాదు ఒక్కోసారి డయేరియాకి కూడా కారణం అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories