Walnuts Side Effects: ఈ వ్యక్తులు వాల్‌నట్స్‌ తినవద్దు.. చాలా ప్రమాదంలో పడుతారు..!

These People Dont eat Walnuts they are very Dangerous
x

Walnuts Side Effects: ఈ వ్యక్తులు వాల్‌నట్స్‌ తినవద్దు.. చాలా ప్రమాదంలో పడుతారు..!

Highlights

Walnuts Side Effects: డ్రై ఫ్రూట్స్‌ లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అందులో ఒకటి వాల్‌నట్స్‌. వీటిలో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

Walnuts Side Effects: డ్రై ఫ్రూట్స్‌ లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అందులో ఒకటి వాల్‌నట్స్‌. వీటిలో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కానీ కొందరికి వాల్ నట్స్ తిన్న తర్వాత అలర్జీ, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే వాల్‌నట్స్‌లో ఆక్సలేట్స్ అనే ఒక రకమైన రసాయనం ఉంటుంది. ఇది కొంతమందికి అలెర్జీని కలిగిస్తుంది. ముఖం, పెదవులు లేదా గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అతిసారం, వాంతులు వంటి సమస్యలు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఆక్సిజన్ అందకపోవడం, గుండె చప్పుడు వేగంగా కొట్టుకోవడం వంటి తీవ్రమైన పరిస్థితులు తలెత్తుతాయి. అయితే వాల్‌నట్స్‌ ఎలాంటి వ్యక్తులు తినకూడదో ఈ రోజు తెలుసుకుందాం.

అల్సర్

అల్సర్ సమస్యతో బాధపడేవారు వాలనట్స్‌ తినకూడదు. వీటిలో ఉండే కొవ్వు, నూనె పొట్టలో ఆమ్లత్వాన్ని పెంచుతుంది. ఇది పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే అల్సర్లు, అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ లేదా కడుపు సంబంధిత వ్యాధి ఉన్నవారు వాల్‌నట్స్‌ తినకూడదు. వీటివల్ల కడుపులో మంట, నొప్పి, తిమ్మిరి వంటి లక్షణాలు ఉంటాయి.

స్థూలకాయం

వాల్‌నట్‌లో ఉండే కొవ్వు, కేలరీలు శరీరం జీవక్రియను ప్రభావితం చేస్తాయి. బరువును వేగంగా పెంచుతాయి. ఇప్పటికే అధిక బరువు ఉన్నవారిలో ఈ సమస్య తీవ్రమవుతుంది. బరువు తగ్గడానికి, ఆహారం, వ్యాయామం సమతుల్యత అవసరం. అధిక క్యాలరీ ఆహారాల వినియోగం ఉండకూడదు. ఒకవేళ చేసినా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

జీర్ణక్రియ

వాల్‌నట్స్‌లో ఉండే ఆక్సలేట్‌లు కొంతమందిలో కడుపునొప్పి, వాంతులు-తిమ్మిరి, గ్యాస్, డయేరియా, అసిడిటీ వంటి సమస్యలను కలిగిస్తాయి. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయని వ్యక్తులలో ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయి.

పొక్కులు

నోరు, నాలుక, గొంతు పూతలు ఉన్నవారు వాల్‌నట్స్‌ తినడం వల్ల అల్సర్‌లు మరింత వ్యాప్తి చెందుతాయి. ఎందుకంటే వాల్ నట్స్ లో చాలా వేడి ఉంటుంది. అందుకే వేసవిలో అస్సలు తినరు.

Show Full Article
Print Article
Next Story
More Stories