Health Tips: డైనింగ్‌ టేబుల్‌పై కనిపించే ఈ పదార్థాలు చాలా డేంజర్..!

These Items on the Dining Table are Hazardous to Your Health
x

Health Tips: డైనింగ్‌ టేబుల్‌పై కనిపించే ఈ పదార్థాలు చాలా డేంజర్..!

Highlights

Health Tips: ఇంట్లో డైనింగ్‌ టేబుల్‌పై చాలా ఆహార పదార్థాలు ఉంటాయి.

Health Tips: ఇంట్లో డైనింగ్‌ టేబుల్‌పై చాలా ఆహార పదార్థాలు ఉంటాయి. వీటిని రుచి కోసం ఉపయోగిస్తారు. కానీ కొన్నిసార్లు ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. డైనింగ్‌ టేబుల్‌పై అలాంటి వస్తువులని వెంటనే తీసేయండి. అవి మీ ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం.

ఉప్పు

ఉప్పు చాలా అనారోగ్యకరమైనది. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు చాలా ఉప్పు తింటాం. అయినప్పటికీ డైనింగ్‌ టేబుల్‌పై ఉన్న ఉప్పును చూసి మరింత వేసుకుంటాం. దీనివల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. దీంతో హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

కెచప్,సాస్

మనలో చాలా మంది అల్పాహారం సమయంలో ఆహారంతో పాటు కెచప్ లేదా సాస్ వేసుకొని తింటాం. తరచుగా పిల్లలు సాస్, కెచప్ ఎక్కువగా ఇష్టపడతారు. కానీ అనేక రకాల కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఇందులో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక రకాలుగా హాని చేస్తాయి. దీని అధిక వినియోగం ఎసిడిటీ, కడుపులో చికాకు కలిగిస్తుంది.

కృత్రిమ స్వీటెనర్లు

ఈ రోజుల్లో చాలా మంది చక్కెరకు బదులు కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగించడం ప్రారంభించారు. అయితే ఒక అధ్యయనంలో బరువు పెరగడం, మెదడు కణితులు, మూత్రాశయ క్యాన్సర్ వంటి అనేక రోగాలు కృత్రిమ స్వీటెనర్లు ఉపయోగిస్తున్నందున వస్తున్నాయని తేలింది. అందుకే వీటిని వాడటం మంచిది కాదు.

Show Full Article
Print Article
Next Story
More Stories