Empty Stomach: పరగడుపున ఈ పదార్థాలు అస్సలు తినకూడదు.. ఎందుకంటే..!

These Ingredients Should not be Eaten at All on an Empty Stomach
x

Empty Stomach: పరగడుపున ఈ పదార్థాలు అస్సలు తినకూడదు.. ఎందుకంటే..!

Highlights

Empty Stomach: ఆధునిక కాలంలో చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

Empty Stomach: ఆధునిక కాలంలో చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వాస్తవానికి కొన్ని ఆహార పదార్థాలను ఎప్పుడు పరగడుపున తినకూడదు. మరోవైపు ఉదయం నిద్ర లేచిన 2 గంటల తర్వాత అల్పాహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారణం చాలా గంటలు నిద్రించిన తర్వాత శరీర జీర్ణవ్యవస్థ వేగవంతం అవడానికి కొంత సమయం కావాలి. కడుపు, శరీరానికి హాని కలిగించే ఆహారాలను ఖాళీ కడుపుతో తినకూడదు. అవేంటో చూద్దాం.

పచ్చి కూరగాయలు, సలాడ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వాటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరంపై అదనపు భారం పడుతుంది. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి ఖాళీ కడుపుతో పచ్చి కూరగాయలను తినడం మానుకోండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పండ్ల రసంతో రోజును ఎప్పుడూ ప్రారంభించకూడదు. దీనికి కారణం రసాలు ప్యాంక్రియాస్‌పై అదనపు భారాన్ని మోపుతాయి. ఇది శరీరానికి మంచిది కాదు. ఖాళీ కడుపుతో ఉండటం వల్ల ఫ్రక్టోజ్ రూపంలో ఉండే చక్కెర కాలేయంపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ఉదయం ఖాళీ కడుపుతో జ్యూస్ తాగకూడదు.

ఒక కప్పు కాఫీతో రోజును ప్రారంభించడం సాధారణ పద్ధతి. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది. జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది. దీని వల్ల కొంతమందిలో కడుపు సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి ఖాళీ కడుపుతో కాఫీని తీసుకోవడం మానుకుంటే మంచిది. పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు కానీ ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. దీనికి కారణం పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కడుపు ఆమ్లత స్థాయిని దెబ్బతీస్తుంది. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ పొట్టలోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీని వల్ల కడుపు నొప్పి, ఎసిడిటీ సమస్య పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories