Excessive Thirst: అధిక దాహానికి ఈ ఆరోగ్య సమస్యలే కారణం.. తెలుసుకొని నివారించండి..!

These Health Problems are the Cause of Excessive Thirst Know and Avoid them
x

Excessive Thirst: అధిక దాహానికి ఈ ఆరోగ్య సమస్యలే కారణం.. తెలుసుకొని నివారించండి..!

Highlights

Excessive Thirst: వేసవిలో దాహం ఎక్కువగా ఉంటుంది కానీ కొంతమందికి కాలంతో పనిలేదు ఎల్లప్పుడు అతి దాహంతో బాధపడుతుంటారు.

Excessive Thirst: వేసవిలో దాహం ఎక్కువగా ఉంటుంది కానీ కొంతమందికి కాలంతో పనిలేదు ఎల్లప్పుడు అతి దాహంతో బాధపడుతుంటారు. తరచుగా నీరు తాగుతూనే ఉంటారు అయినప్పటికీ వారి దాహం తీరదు. అంతేకాదు అర్దరాత్రి గొంతు ఎండిపోతుంది. దీంతో నిద్రభంగం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిని తేలికగా తీసుకోకూడదు. దీని వెనుక ఉండే కారణాలని తెలుసుకోవాలి. అతి దాహం అనేది దీర్ఘకాలిక సమస్య దీనిని నివారించకుంటే చాలా ప్రమాదంలో పడుతారు.

1. డీహైడ్రేషన్

శరీరంలో నీటికొరత ఏర్పడినప్పుడు డీహైడ్రేషన్‌ సమస్య ఎదురవుతుంది. ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగినా దాహం తీరదు. ఇందుకోసం సిప్‌ సిప్‌గా వాటర్‌ తాగుతూ దాహం తీర్చకునే ప్రయత్నం చేయాలి.

2. పొడి నోరు

కొంతమందికి నోటిలో లాలాజలం ఉండదు. దీంతో వారి నోరు పొడిగా మారుతుంది. తరచుగా నీళ్లు తాగినా దాహం తీరదు. పైగా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఇలాంటి సమయంలో డాక్టర్‌ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.

3. మధుమేహం

మధుమేహ పేషెంట్లు అతి దాహానికి గురవుతారు. తరచుగా నీళ్లు తాగుతూ ఉంటారు. అయినపపటికీ దాహం తీరదు. అందుకే వీరు ఎక్కడున్నా వీరివెంట వాటర్‌ బాటిల్‌ ఉంటుంది. లేదంటే డీ హైడ్రేషన్‌కి గురవుతారు.

4. ఆహార అలవాట్లు

జంక్‌ ఫుడ్‌, మసాల ఆహారం ఎక్కువగా తినే వ్యక్తులు అతి దాహానికి గురవుతారు. ఇలాంటి వ్యక్తులు ఈ ఆహారాలని తినడం మానుకుంటే మంచిది.

5. రక్తహీనత

శరీరంలో రక్తం లోపిస్తే రక్తహీనత పరిస్థితి ఎదురవుతుంది. ఈ స్థితిలో శరీరంలో ఎర్ర రక్తకణాల లోపం ఏర్పడుతుంది. దీంతో డీ హైడ్రేషన్‌కి గురై మళ్లీ మళ్లీ నీళ్లు తాగాలని అనిపిస్తుంది. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు.

Show Full Article
Print Article
Next Story
More Stories