Health Tips: చలికాలంలో ఈ పండ్లు తప్పక తినాలి.. గుండె సమస్యలు దూరమవుతాయి..!

These Fruits Must Be Eaten In Winter Heart Problems Will Go Away
x

Health Tips: చలికాలంలో ఈ పండ్లు తప్పక తినాలి.. గుండె సమస్యలు దూరమవుతాయి..!

Highlights

Health Tips: చలికాలం వ్యాధుల కాలం. ఈ సీజన్‌లో చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే చలికి రోగనిరోధక శక్తి తగ్గుతూ ఉంటుంది.

Health Tips: చలికాలం వ్యాధుల కాలం. ఈ సీజన్‌లో చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే చలికి రోగనిరోధక శక్తి తగ్గుతూ ఉంటుంది. గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా డైట్‌లో కచ్చితంగా సీజనల్‌ ఫ్రూట్స్‌ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. చాలామంది చలికాలంలో బద్దకానికి గురై వ్యాయామం చేయరు. దీనివల్ల ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి గుండె సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల గుండెపోటు ముప్పు పెరుగుతుంది.

శరీరంలో మంచి, చెడు అనే రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభిస్తే రోగాలు దరిచేరి ఇబ్బందిపెడుతాయి. రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాలు, స్వీట్లు, మటన్, ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చలికాలంలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల పండ్లను తప్పకుండా తినాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

చలికాలంలో ఎక్కువగా సిట్రస్‌ పండ్లు తినాలి. ఈ సీజన్‌లో మార్కెట్లో నారింజ, ముసాంబి, బత్తాయి అందుబాటులో ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఏదైనా పండు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రతిరోజూ ఈ పండ్లలో ఏదో ఒకటి తినాలి. శీతాకాలంలో మధ్యాహ్నం పూట నారింజ తినగలిగితే ఇంకా మంచిది.

చలికాలంలో యాపిల్స్ అధికంగా లభిస్తాయి. క్రమం తప్పకుండా ఆపిల్ తినడం వల్ల స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. ఎందుకంటే యాపిల్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఆపిల్ పీల్స్‌లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆపిల్ పీల్స్‌లో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచే ఫైబర్ ఉంటుంది.

పుచ్చకాయ ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. పుచ్చకాయ ధమనులను శుభ్రపరుస్తుంది. ఈ పండులో ఫైబర్, విటమిన్లు, లైకోపీన్ వంటి మినరల్స్‌ ఉంటాయి. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలను నివారిస్తుంది.

ఎర్ర ద్రాక్షలో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను దూరం చేస్తాయి. పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్ రెస్వెరాట్రాల్ సమ్మేళనం ద్రాక్ష తొక్కల్లో ఉంటుంది. ఇది LDL పెరగకుండా నిరోధిస్తుంది. ఇవన్నీ చలికాలంలో కచ్చితంగా తినాల్సిన పండ్లు. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎటువంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తప్పకుండా తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories